బిగ్ బాస్ తెలుగు సీజన్ 6.. అంగరంగ వైభవంగా ఈ బుల్లితెర బిగ్గెస్ట్ రియాలిటీ షో ప్రారంభం అయ్యింది. హోస్ట్ గా కింగ్ నాగార్జున అదే జోష్ తో షోని స్టార్ట్ చేశాడు. స్పెషల్ సాంగ్స్, ఎలివేషన్స్ తో స్టేజ్ అంతా పండగలా మారిపోయింది. బిగ్ బాస్ తెలుగు సీజన్ 6 18వ కంటెస్టెంట్‌గా మోడల్ రాజశేఖర్ హౌస్‌లోకి అడుగుపెట్టాడు. మోడల్‌గా ఎంత పేరున్నా రాజశేఖర్ గురించి చాలా మందికి తెలియక పోవచ్చు. గత సీజన్లో మోడల్ జెస్సీ ఎంతగా అలరించాడో చూశాం. ఇప్పుడు ఆ మోడల్ కేటగిరీలో మోడల్ రాజశేఖర్ అడగుపెట్టాడు. అయితే రాజశేఖర్‌కి జెస్సీకి చాలా దగ్గర పోలికలు ఉన్నాయి. అంటే ఎత్తు పొడుగులో కాదు.. కెరీర్, కష్టాల్లో బాగా దగ్గరగా ఉన్నారు.
చిన్న వయసులోనే తండ్రి చనిపోవడంతో కుటుంబ భారం రాజశేఖర్ మీద పడింది. జీవితంలో రాజ శేఖర్ మోడల్ కాక ముందు ఆఫీస్ బాయ్‌గా పని చేశాడు. అక్కడ తనకన్నా ఎంతో పెద్దవాళ్లతో పని చేసే క్రమంలో తనకి ఈ జాబ్, లైఫ్ సెట్ కావని డిసైడ్ అయిపోయాడు. అక్కడే అతని మెదడులో పాత్ మార్చుకోవాలని నిర్ణయం తీసుకున్నాడు. ఆ తర్వాతే మోడలింగ్ వైపు అడుగులు వేశాడు. అక్కడి నుంచి లైఫ్‌లో వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. చాలా మంచి పేరు సొంతం చేసుకున్నాడు. ఈ బిగ్ బాస్ హౌస్‌లో తనని తాను నిరూపించుకుని కెరీర్‌లో మరో అడుగు ముందుకు వేసేందుకు ఈ బిగ్ బాస్ లో అడుగుపెట్టినట్లు తెలిపాడు. తాను చేయబోయే సినిమా కోసం ఈ బిగ్ బాస్ తనని తెలుగు ప్రేక్షకుకు బాగా దగ్గర చేస్తుందనే నమ్మకంతో వచ్చినట్లు చెప్పుకొచ్చాడు.