బిగ్ బాస్ తెలుగు సీజన్-6 ప్రారంభం కావడానికి ఇంకా కొన్ని రోజులు మాత్రమే మిగులున్నాయి. సెప్టెంబర్ 4 నుంచి బిగ్ బాస్ సీజన్ 6 ప్రారంభం కానున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ఇప్పటికే ప్రోమోలతో ప్రేక్షకుల్లో అంచనాలు పెంచేస్తున్నారు. ఈసారి కామన్ మ్యాన్ కేటగిరీలో కూడా సభ్యుడు రావడం అందరిలో ఆసక్తి పెంచుతోంది. ఎప్పటిలాగానే సోషల్ మీడియా, యూట్యూబ్, టీవీ, జబర్దస్త్, మీడియా ఇలా అన్ని విభాగాల నుంచి సభ్యులను ఎంపిక చేయనున్నారు.
ఇప్పటికే ఇదే ఫైనల్ లిస్ట్ అంటూ కొన్ని పేర్లు వినిపిస్తున్నాయి. కానీ, బిగ్ బాస్ లో స్టేజ్‌పైకి వచ్చే వరకు కూడా ఎవరినీ కన్ఫామ్ చేయడానికి లేదు. వాళ్లు ఆఖరి క్షణంలోనూ అభిప్రాయాలను మార్చుకుంటూ ఉంటారు. అయితే ఈసారి బిగ్ బాస్ తమ పాత ఫార్ములాను మళ్లీ ఉపయోగించనున్నట్లు తెలుస్తోంది. బిగ్ బాస్ సీజన్ 3లో ఉపయోగించిన రియల్ కపుల్ ఫార్ములాను ఈ సీజన్‌లోనూ ప్రయత్నించనున్నట్లు తెలుస్తోంది.
నిజానికి బిగ్ బాస్ హౌస్‌లో రియల్ కపుల్ ఉంటే కాస్త డ్రామా, ఎమోషన్స్ పండించడానికి ఉంటుంది. బిగ్ బాస్ తెలుగు సీజన్ 3లో వరుణ్ సందేశ్- వితికా షేరీ కపుల్ పండించిన ఎమోషన్స్, డ్రామా అంతా ఇంతా కాదు. కంటెంట్ ఇవ్వడంలో రియల్ కపుల్ ముందుండేవారు. అందుకే రెండు సీజన్ల తర్వాత మళ్లీ ఆ ఫార్ములాను ఉపయోగిచంనున్నట్లు తెలుస్తోంది.
ఈసారి రియల్ కపుల్ కేటగిరీలో బుల్లితెర ప్రేక్షకులకు బాగా పరిచయం ఉన్న సీరియల్ స్టార్లను తీసుకోనున్నట్లు టాక్ వినిపిస్తోంది. టీవీ ఆర్టిస్ట్ లు రోహిత్- మెరీనాలను రంగంలోకి దిపనున్నట్లు తెలుస్తోంది. వీరికి టీవీ, సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉంది. వీళ్లిద్దరూ సినిమాల్లోనూ నటించారు. మెరీనా 2016లో రొమాన్స్ విత్ ఫైనాన్స్ అనే తెలుగు చిత్రంలో హీరోయిన్ గా నటించింది. అటు రోహిత్ షహ్‌నీ కూడా 2015లో చిరు గొడవలు అనే చిత్రంలో హీరోగా చేశాడు.
వీళ్లిద్దరూ కలిసి ‘డాన్స్ జోడీ డాన్స్’ లోనూ పార్టిసిపేట్ చేసి ప్రేక్షకుల మన్ననలు పొందారు. వీళ్లు టీవీ సీరియల్స్ చూసే వాళ్లకు బాగా పరిచయస్తులే అందుకే బిగ్ బాస్ వీళ్లను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. అయితే వీళ్ల అభిమానులు మాత్రం వీళ్ల మధ్య ఎలాంటి గొడవలు, మనస్పర్దలు లేకుండా బిగ్ బాస్ నుంచి రావాలంటూ కోరుకుంటున్నారు. రోహిత్- మెరీనా జంట బిగ్ బాస్‌లో అడుగుపెడితే ఎలా ఉంటుంది? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.