బిగ్ బాస్ షో ధూమ్ ధామ్ గా స్టార్ట్ అయిపోయింది. గత ఐదు సీజన్లకు మించి ఈసారి రచ్చ చేసేందుకు కంటెస్టెంట్స్ రెడీ. ఒక్కొక్కరిగా హౌస్ లోకి అడుగుపెడుతున్నారు. ఇక మూడో సీజన్ లో కపుల్ కేటగిరీలో హీరో వరుణ్ సందేశ్ భార్య వితికతో కలిసి పాల్గొన్నాడు. తమ గేమ్ తో ఆడియెన్స్ ని ఎంటర్ టైన్ కూడా చేశారు. ఇప్పుడు వాళ్ల రూట్ లోనే మరో రియల్ లైఫ్ జోడీ బిగ్ బాస్ హౌస్ లోకి ఎంటరైంది. వాళ్లే సీరియల్ నటులుగా అందరికీ తెలిసిన మెరీనా-రోహిత్. మరి ఈ జోడీ.. వరుణ్-వితికని మరిపిస్తారా? బిగ్ బాస్ లో తమదైన మార్క్ క్రియేట్ చేస్తారా?
ఇక వివరాల్లోకి వెళ్తే.. బిగ్ బాస్ ఆరో సీజన్ లో పాల్గొన్న కలర్ ఫుల్ రియల్ లైఫ్ జోడీ మెరీనా అబ్రహం-రోహిత్ షాహ్నీ. వీరిద్దరూ కూడా సీరియల్ నటులే కావడం విశేషం. మెరీనా.. గోవాలోని క్రిస్టియన్ ఫ్యామిలీలో పుట్టగా, రోహిత్ ని పెళ్లి చేసుకుని హైదరాబాద్ కి షిప్ట్ అయిపోయింది. ‘అమెరికా అమ్మాయి’ సీరియల్ తో బుల్లితెర ఎంట్రీ ఇచ్చిన మెరీనా.. ‘ఉయ్యాలా జంపాలా’ సీరియల్ లో కూడా నటించింది. రొమాన్స్ విత్ ఫైనాన్స్ (తెలుగు), సబ్ కా దిల్ ఖుష్ (హిందీ) సినిమాల్లోనూ హీరోయిన్ గా చేసింది. 2017లో మోస్ట్ డిజైరబుల్ ఉమన్ ఆన్ టీవీ అవార్డు కూడా గెలుచుకుంది.
ఇక నీలి కలువలు, అభిలాష సీరియల్స్ తో పాపులర్ అయిన రోహిత్ ని 2017 నవంబరులో మెరీనా పెళ్లి చేసుకుంది. ఈ జంట చాలామందికి కొత్త ముఖాలుగా అనిపించినా.. టీవీ చూసేవారికి మాత్రం పాత జంటనే. యూట్యూబ్ వీడియాలతోనూ బాగా పాపులరైన ఈ జంట.. బిగ్ బాస్ సీజన్ 6లో గట్టిగా పోటీ ఇస్తారనడంలో ఎలాంటి సందేహం లేదు. మరి ఆటలో వరుణ్-వితిక జోడీలా ఎలాంటి గొడవలు లేకుండా.. పర్సనల్ లైఫ్ కి ఇబ్బంది లేకుండా బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు రావాలనే కోరుకుందాం. మరి ఈ జోడీ ఫ్యాన్స్ ఎన్ని వారాలుంటుందని అనుకుంటున్నారు. మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో పోస్ట్ చేయండి.
ఇదీ చదవండి: ఎపిసోడ్‌కి రూ.55 లక్షలు! నాగార్జున రెమ్యూనరేషన్ లెక్కలు చూస్తే నోరెళ్లబెట్టాల్సిందే!