బిగ్ బాస్ తెలుగు సీజన్ 6.. హౌస్‌లో రోజు రోజుకీ ఇన్టెన్సిటీ పెరిగిపోతోంది. అంతా గొడవలు, గ్రూపులు అంటూ తెగ బిజీ అయిపోయారు. బిగ్ బాస్ ప్రేక్షకులు ఏం కావాలో మొదటి రోజు నుంచీ ఇంట్లోని సభ్యులు అదే కంటెంట్ ఇస్తూ దూసుకుపోతున్నారు. గొడవలకైతే అసలు కొదవ లేదు. ఇదిలా ఉండగా.. రియల్ కపుల్ తమదైనశైలిలో ఎంటర్‌టైన్ చేస్తున్నారు. ప్రేక్షకులంతా ఆ జంటను చూస్తూ పాపం రోహిత్ సాహ్నీ అంటూ ఫన్నీగా జాలి చూపిస్తున్నారు. ఎందుకంటే అక్కడ కూడా అతనికి భార్య పోరు తప్పడం లేదంటూ కామెంట్ చేస్తున్నారు. ఎందుకంటే మొదటి రోజు నుంచీ మెరీనా తనకు సమయం కేటాయించడం లేదంటూ గొడవ పడుతూనే ఉంది. మొన్నొక రోజు అయితే కళ్లల్లోకి చూస్తూ వినడం లేదంటూ అలిగి వెళ్లిపోయింది.
గురువారం అయితే.. తన భర్తను శ్రీసత్య పిలుస్తోందంటూ పెద్ద గొడవ చేశారు. నేను మాట్లాడాలి అనుకుంటున్న సమయంలో నా మొగుడ్ని వాకింగ్ చేద్దాం రా అంటూ శ్రీ సత్య పిలుస్తోంది. అంటూ మెరీనా రచ్చ రచ్చ చేసింది. పక్కకు వెళ్లి ఏడ్చేసింది. ఆ సీన్ చూసి హౌస్‌లో ఉన్న వాళ్లంతా నిజమనుకుని గాబరా పడిపోయారు. మెరీనాను ఓదార్చేందుకు తెగ ప్రయత్నించారు. ఈ గ్యాప్‌లో శ్రీ సత్య ఓయ్ ఇదంతా యాక్టింగ్ కదా అంటూ అసలు విషయం చెప్పేసింది. ఇవన్నీ పక్కన పెడితే పాపం రోహిత్ సాహ్నీ మాత్రం ఎంతో కష్టపడిపోతున్నాడు. ఏ విషయంలో అంటారా? మెరీనా విషయంలో. అవును ఆమె విషయంలో రోహిత్ చాలా కష్టపడుతున్నాడు.
రోహిత్ సాహ్నీ ఏమో కెమెరాలు ఉన్నాయని ఎంతో పద్ధతిగా నడుచుకోవాలని తెగ ట్రై చేస్తున్నాడు. మెరీనా మాత్రం తనను పట్టించుకోవడం లేదు, తనకు టైమ్ ఇవ్వడం లేదు, హగ్ చేసుకుంటుంటే నెట్టేస్తున్నాడు. అంటూ తెగ ఫీలైపోతోంది. అంతేకాకుండా ఇంట్లోని సభ్యులను కూర్చోబెట్టుకుని తన బాధలు చెప్పుకుంటోంది. నా మొగడు నాకు హగ్ ఇవ్వడం లేదు, బేబీ అని పిలవడం లేదు అని వాపోతోంది. ఇంకా మూడు రోజులు చూస్తాను.. నార్మల్‌గా ఇవ్వకపోతే ఇంటికి వెళ్లాక తన సంగతి చెప్తానంటూ చెప్పుకొచ్చింది. నిన్న రాత్రి మాత్రం.. దుప్పటిలో చేయి పట్టుకున్నాడు, మళ్లీ 5 నిమిషాలకే నిద్ర పోయాడంటూ వాపోయింది. ఇదంతా చూస్తున్న ప్రేక్షకులు మాత్రం తెగ నవ్వేసుకుంటున్నారు. పాపం రోహిత్‌కు బిగ్ బాస్‌కి వెళ్లినా భార్య పోరు తప్పడం లేదంటున్నారు. ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.