బిగ్ బాస్ తెలుగు సీజన్ 6.. ఈవారం ఫ్యామిలీ వీక్ కావడంతో ఇల్లు ఎమోషన్స్ తో నిండిపోయింది. ఇప్పటికే ఆదిరెడ్డి కోసం భార్యాకుమార్తె, రోహిత్ కోసం తల్లి, రాజ్ వాళ్ల అమ్మ, శ్రీసత్య కోసం తల్లిదండ్రులు, ఫైమా వాళ్ల అమ్మ, శ్రీహాన్ కోసం సిరి- చైతన్య వచ్చారు. ఇప్పటికే వాళ్లు రావడంతో ప్రేక్షకులు కూడా బాగా ఎమోషనల్ గా ఉన్నారు. ఇప్పుడు వారిని మరింత భావోద్వేగానికి గురి చేసే విషయం ఒకటి జరిగింది. కీర్తీ భట్ ఎప్పుడూ తనకి ఎవరూ లేరు, తనకోసం ఎవరూ రారు అనుకుంటూ ఉంది. ఎవరి ఫ్యామిలీ మెంబర్ వచ్చినా వాళ్లను చూస్తూ బాధపడుతూ ఉంది. శ్రీసత్య వాళ్ల తల్లిదండ్రులు మీకు మేమున్నాం.. మా ఇంటికి వచ్చేయ్ అని కూడా అడిగారు. అయితే కీర్తి కోసం కూడా ఒకరు హౌస్‌లోకి వచ్చారు.
కీర్తీ భట్ కోసం తన కో-స్టార్ మనసిచ్చి చూడు ఫేమ్ ఆది అలియాస్ మహేశ్‌బాబు కాళిదాసు వచ్చాడు. బయట కూడా వీళ్లిద్దరు చాలా మంచి క్లోజ్ ఫ్రెండ్స్ అని అందరికీ తెలుసు. సీరియల్‌లోనే కాకుండా స్పెషల్ ఈవెంట్స్ లోనూ కలిసి పర్ఫామ్ చేసి అభిమానులను మెప్పించారు. ఇంతకు ముందే మహేశ్ తన ఇన్‌స్టాగ్రామ్ లైవ్‌లో చెప్పుకొచ్చాడు.. కీర్తీ భట్ కోసం అందరి తరఫున తానే బిగ్ బాస్ హౌస్‌లోకి వెళ్తాను అని. చెప్పినట్లుగానే మహేశ్ తన ఫ్రెండ్ కీర్తీ భట్ కోసం హౌస్‌లోకి వెళ్లాడు. మహేశ్‌ని చూడగానే కీర్తీ భట్ ఎగిరి గంతేసింది. కీర్తీతో స్టెప్పులు వేసి ఆమెని ఉత్సాహపరిచాడు. కీర్తీకి నుదిటిన ముద్దు పెట్టి మహేశ్ రెడ్ రోజ్ ప్రెజెంట్ చేశాడు.
ఇంక హౌస్‌లో మహేశ్ ఫుల్ హంగామా చేశాడు. హౌస్‌లో ఉన్న అందరితో మంచిగా కబుర్లు చెప్పాడు. ఫైమాని కామెడీ స్పెల్లింగ్ చెప్పాలంటూ టీజ్ చేశాడు. అయితే ఫైర్ బ్రాండ్ ఇనయా సుల్తానాని కూడా మాటలతో మాయ చేశాడు. ఇనయా నాకు ఒక మాట చెప్పండి. మీరు ఇప్పుడు ముద్దు ఇక్కడ పెడతారా? ఇక్కడ పెడతారా? అంటూ రెండు చెంపలు చూపించాడు. ఇనయా ముఖంలో సిగ్గులు మొగ్గలు వేశాయి. కీర్తీకి మహేశ్ ధైర్యం చెప్పుకొచ్చాడు. “నువ్వు లైఫ్‌లో చాలా కోల్పోయావ్.. దేవుడు నీ దగ్గరి నుంచి చాలా తీసేసుకున్నాడు. కానీ, అదే దేవుడు నీకు ఇంకో అవకాశం ఇచ్చాడు.. అదే బిగ్ బాస్” అంటూ మహేశ్ కీర్తీ భట్‌కు ధైర్యం చెప్పాడు. బాగా ఆడాలని తెలిపాడు.