జబర్థస్త్ షోతో పాపులారిటీ తెచ్చుకున్న లేడీ కమెడియన్స్ అతి తక్కువమందే ఉంటారు. వారిలో ఫలక్‌నామా ఫైమా ఒకరు. ఫైమా తన విలక్షణమైన నటనతో అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. ఇక, ఫైమా ‘‘పటాస్’’ అనే స్టాండప్ కామెడీ షోతో బుల్లితెరపైకి వచ్చారు. ఫాహిమా షేక్ కాస్తా ఫైమా అయ్యారు. కాలేజ్ తరపున పటాస్ షోకు వచ్చి, తన నటనతో అందర్నీ ఆకర్షించారు. కంటెస్టెంట్‌గా ఎంపికయ్యారు. కంటెస్టెంట్‌గా అంచెలంచెలుగా ఎదిగారు. తర్వాత జబర్థస్త్ షోలోకి అడుగుపెట్టారు. అక్కడ కూడా సూపర్ అనిపించుకున్నారు. ఇప్పుడు బిగ్ బాస్ తెలుగు సీజన్ 6 షో అవకాశం రావడంతో ఫైమా దశ తిరిగినట్లు అయ్యింది. బిగ్ బాస్ 6లో ఫైమా 17వ సభ్యురాలిగా అడుగుపెట్టింది.
ఇక, ఫైమా కుటుంబం విషయానికి వస్తే.. ఫైమా నిరుపేద కుటుంబం నుంచి వచ్చింది. ఉండటానికి ఇళ్లు కూడా లేదు. ఆమె తండ్రి దినసరి కూలీ, తల్లి బీడీలు చుడుతూ ఉంటుంది. ఫైమాకు ముగ్గురు అక్కలు ఉన్నారు. ఆమె నాలుగో సంతానం. నెల రెంట్లు కట్టలేక, కుటుంబాన్ని పోషించలేక తండ్రి ఇబ్బందులు పడేవాడు. అయినప్పటికి ఫైమాను చదివించసాగాడు. ఇలాంటి సమయంలోనే కాలేజ్ తరపునుంచి ఫైమా ‘పటాస్’షోకు వెళ్లింది. అక్కడ సెలెక్ట్ అయింది. అయితే, ఇంట్లో వాళ్లకు ఇది ఇష్టం లేదు. పటాస్‌లోని డైరెక్టర్, శ్రీముఖి, రవి మరికొంతమంది ఆమెకు చేయూతనిచ్చారు. దీంతో తన సత్తాచాటిందామె. ఆ తర్వాత ఇంట్లోవాళ్లు కూడా ఆమెకు ఆసక్తి ఉన్న సంగతిని గుర్తించి ప్రోత్సహించారు.
కొన్ని నెలల తర్వాత పటాస్ షో ఆగిపోయింది. అప్పటినుంచి ఫైమా ఇంటికే పరిమితం అయ్యారు. కొన్నిరోజుల తర్వాత అవినాష్ గ్రూపులో అవకాశం దక్కించుకున్నారు. ఆ తర్వాత తిరిగిచూసుకునే అవకాశం రాలేదు. బుల్లితెరలో క్రేజీ సెలెబ్రిటీగా మారిపోయారు. ఈ నేపథ్యంలో ప్రముఖ రియాల్టీ షో ‘బిగ్ బాస్’ సీజన్ 6కు ఎంపికయ్యారు. ‘బిగ్ బాస్’ హౌస్‌లోకి కంటెస్టెంట్‌గా అడుగుపెట్టారు. మరి, తన కామెడీ టైమింగ్‌తో అందర్నీ ఆకట్టుకున్న ఫైమా బిగ్‌బాస్ హౌస్‌లో చివరి వరకు నెగ్గుకొస్తుందా లేదా అన్న దానిపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.