‘బిగ్ బాస్ తెలుగు సీజన్ 6’ అనుకున్న దానికంటే ఎక్కువే ఉత్కంఠను రేకెత్తిస్తోంది. తొలిరోజు నుంచి ఇంట్లోని సభ్యుల మధ్య ఒక ఉద్రిక్త వాతావరణం ఉండేలా బిగ్ బాస్ జాగ్రత్త పడుతున్న విషయం ప్రతి టాస్కు, ప్రతి నిర్ణయంలో కనిపిస్తూనే ఉంటుంది. తొలి టాస్కుతోనే ఇంట్లో సభ్యులను గ్రూపులుగా విడగొట్టిన బిగ్ బాస్ ఆ తర్వాత అది కొనసాగేలా చూశాడు. సభ్యులు కూడా అలాగే ప్రవర్తిస్తూ ఒకరిలో ఒకరు కొట్టుకుంటూనే ఉన్నారు. తాజాగా నామినేషన్స్ లో ఎవరి మనసులో ఏముందో అర్థమైంది. పైకి నవ్వుతూ కనిపించగానే మాట్లాడుకున్న వాళ్లంతా ఇప్పుడు ముఖాలు చాటేస్తున్నారు. ఎందుకంటే నామినేషన్స్ లో అంతా ఓపెన్ అయిపోయారు. ఇప్పుటి నుంచే హౌస్‌లో ఎవరు ఏ గ్రూప్ అన్నది క్లియర్‌గా తెలుస్తుంది.
తొలివారం నామినేషన్స్ లో మొత్తం ఏడుగురు సభ్యులు ఉన్నారు. అయితే అందరికంటే ఎక్కువ ఓట్లు రేవంత్‌కో పడ్డాయి. మొత్తం 8 ఓట్లతో రేవంత్ టాప్ లిస్ట్ లో ఉన్నాడు. ఓటింగ్ చేసిన వారిలో కరెక్ట్ గా సగం మంది రేవంత్ పేరే చెప్పారు. క్లాస్‌లో ముగ్గురు, ట్రాష్ ముగ్గురు సభ్యులు పోతే మాస్ సెక్షన్ లో 15 మంది ఉన్నారు. వారిలో 8 మంది రేవంత్‌కే ఓటేశారు. తొలిరోజు నుంచి రేవంత్ విషయంలో చాలా మంది అసంతృప్తితో ఉన్నారు. కాకపోతే ఆ విషయాన్ని అతనితో చెప్పలేదు. నామినేషన్స్ లో నేరుగా అతనికే చెప్పేశారు. అసలు అతనితో వాళ్లకి వచ్చిన బాధలేంటో కూడా చెప్పుకొచ్చారు. ఇలా చేస్తున్నాం, అలా ఉంటున్నావ్ అంటూ చాలానే పాయింట్లు చెప్పారు.
అవేంటంటే.. రేవంత్ ఎదుటి వారికి మాట్లాడే అవకాశం ఇవ్వడం లేదు, రేవంత్ అన్నింటిలో కలుగజేసుకుంటున్నాడు, వాయిస్ రేజ్ చేసి మాట్లాడుతున్నాడు, తనది తప్పు ఎవరైనా చెబితే ఒప్పుకోడు, ఒకే విషయాన్ని పదే పదే జెబుతున్నాడు.. ఇలా ఎవరికి అనిపించిన మాటలు వాళ్లు చెప్పుకుంటూ వెళ్లారు. నిజానికి హౌస్‌లో ఉన్న స్ట్రాంగ్ కంటెస్టెంట్లలో రేవంత్ ఒకడు. అతను టైటిల్ ఫేవరెట్‌గా హౌస్‌లో అడుగుపెట్టాడు. కానీ, తొలివారంలోనే ఈ స్థాయిలో నెగెటివిటీ రావడంతో అతని ప్లేస్ ఏంటో ఎవరికీ అర్థం కావడం లేదు. తొలి నామినేషన్‌లో అత్యధిక ఓట్లతో టాప్ ప్లేస్ నిలవడం అందరినీ ఆశ్యర్యానికి గురి చేసింది. ఇంట్లో అన్ని పనులు చేస్తున్నా అతడిని మాత్రం ఇలా ఎందుకు అంటున్నారంటూ ఫ్యాన్స్ ప్రశ్నిస్తున్నారు.
అంతేకాకుండా ప్రస్తుతం సోషల్ మీడియాలో అతడికి మద్దతిచ్చే వాళ్లు.. రేవంత్ ని టార్గెట్ చేస్తున్నారంటూ కామెంట్ చేస్తున్నారు. కావాలనే అతడిని బ్యాడ్ చేయాలని చూస్తున్నట్లు ఆరోపిస్తున్నారు. అతడు స్ట్రాంగ్ కంటెండర్ కావడంతో రేవంత్‌ని త్వరగా పంపేయాలనే ఇలా చేస్తున్నట్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఫ్యాన్స్ ని పక్కన పెడితే రేవంత్ కాస్త ఎక్కువ ఇన్వాల్స్ అవుతున్నాడనే భావన అటు ప్రేక్షుల్లోనూ ఉంది. అందుకే రేవంత్‌ని టార్గెట్ చేస్తున్నారనే మాటలను, వాదనను వాళ్లు అంగీకరించడం లేదు. ఎంత స్ట్రాంగ్ సభ్యుడైనా కూడా బిగ్ బాస్ గ్యారెంటీ ఇవ్వలేం. గత సీజన్లో తొలివారంలోనే ఆర్జే చైతూని ఎలిమినేట్ షాకిచ్చిన విషయం తెలిసిందే. అలాంటిది మళ్లీ ప్లాన్ చేస్తే మాత్రం రేవంత్ ఇంటికి వెళ్లిపోవాల్సిందే. రేవంత్‌ని టార్గెట్ చేశారా? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.