బిగ్ బాస్ తెలుగు సీజన్ 6.. చాలా ఉత్కంఠగా సాగుతోంది. హౌస్‌లోని సభ్యులు మొత్తం గొవడలు, గ్రూపులు, విమర్శలు అంటూ తెగ బిజీగా గడిపేస్తున్నారు. కెప్టెన్సీ టాస్కు కూడా అయిపోయింది. బాలాదిత్య బిగ్ బాస్ తెలుగు సీజన్ 6 తొలి కెప్టెన్‌గా గెలుపొందాడు. ఆ తర్వాత గలాటా గీతూ వరస్ట్ పర్ఫార్మర్‌గా నామినేట్ అయ్యి జైల్లో కూర్చొంది. ఈసారి ప్రతి విషయంలో ఏదీ అంత ఈజాగా తెగడం లేదు. అంటే ప్రతి విషయానికి డిస్కషన్, సాక్షులు, వాదనలు అంటూ అంతా రచ్చ రచ్చ చేస్తున్నారు. నిజానికి అన్ని సీజన్లలో తొలివారం ఎంతో ప్రశాంతంగా సాగేది. కానీ, ఈ సీజన్ మాత్రం మొదటి రోజు నుంచే అన్నీ గొడవలు షురూ అయ్యాయి. ఎవరూ ఒక్క మాటతో అర్థం చేసుకునేలా కనిపించలేదు.
ముఖ్యంగా ఆర్జీవీ బ్యూటీ ఇనయా సుల్తానా ప్రవర్తన అయితే ఎవరికీ అర్థం కావడం లేదు. తాను చెప్పాలి అనుకున్నది చెబుతోంది. కానీ, ఆ విషయంలో ఆమె ప్రమేయం ఉందా? లేక ఆ విషయం వల్ల ఆమె ఏమైనా ఎఫెక్ట్ అవుతోందా? అనే విషయాలు పట్టించుకోదు. ఏం జరుగుతున్నా కూడా నా పాయింట్ నేను చెబుతా అంటూ మాట్లాడుతుంది. ఇద్దరి మధ్య గొడవ జరుగుతుంటే మధ్యలో నా పాయింట్ చెప్తానంటూ వస్తుంది. అంత అవసరం ఏముంది అని ఇంట్లోని సభ్యులు, ప్రేక్షకులు ప్రశ్నిస్తున్నారు. మాట మాట్లాడితే నాకు సపోర్ట్ లేదు అంటూ కామెంట్ చేస్తోంది. అలాంటప్పుడు జాగ్రత్తగా ఆడుకుని ఫ్యాన్ బేస్ బిల్డ్ చేసుకోవాలి. కానీ, ఆమె అలా కాకుండా ప్రేక్షకులను సైతం ఇరిటేట్ చేస్తోంది.
ఇంక తాజాగా శ్రీహాన్, బాలాదిత్యలను ముప్పుతిప్పలు పెట్టింది. బాలాదిత్య తనని టార్గెట్ చేస్తున్నాడంటూ కామెంట్ చేసింది. నాకు ఎలాంటి సపోర్ట్ లేదు, మీరు ఎంత టార్గెట్ చేసినా నేను ఫైట్ చేస్తా.. నేను ఫైటర్ అంటూ డైలాగులు చెబుతోంది. మరోవైపు శ్రీహాన్ విషయంలో ఆమె నచ్చింది ఊహించుకుని కామెంట్ చేస్తోంది. కీర్తీ భట్ ఫీలింగ్స్ వస్తున్నాయని అన్నందుకు ఆమెను నామినేట్ చేశాడని, అతనితో రెండు గంటలు కూర్చున్నందుకు తనకు వరస్ట్ పర్ఫార్మర్ ఇచ్చాడని ఇనయా సుల్తానా చెప్పుకొచ్చింది. శ్రీహాన్ సేఫ్ గేమ్ ఆడుతున్నాడంటూ ఇనయా ఆరోపించింది. తన గురించి ఎలా వెళ్తుందో అని భయపడుతున్నట్లు కామెంట్ చేసింది.
అసలు ఫీలింగ్స్ అనే మాటే రాలేదు కదా డిస్కషన్‌లో అని శ్రీహాన్ ప్రశ్నించగా.. అది కాకపోయినా అలాగే చెప్పిందని తెలిపింది. కీర్తీ తనని తాను ప్రూవ్ చేసుకోవడానికే బ్రో అనాల్సి వచ్చిందని చెప్పింది అంటూ ఇనయా చెప్పింది. మధ్యలో రేవంత్, అర్జున్ కల్యాణ్ కూడా పాల్గొని ఈ గొడవను మరింత ముందుకు తీసుకెళ్లారు. మొత్తానికి శ్రీహాన్ సేఫ్ గేమ్ ఆడుతున్నాడు. అతనితో ఏ అమ్మాయి క్లోజ్‌గా ఉన్నా, దగ్గరవుదామనుకున్నా బయటకు ఎలా ప్రొజెక్ట్ అవుతుందో అనే భయంతో నామినేట్ చేస్తాడు అంటూ ఇనయా సుల్తానా చెప్పుకొచ్చింది. అందుకే కీర్తీని నామినేట్ చేసింది, తనకు వరస్ట్ పర్ఫార్మర్ ఇచ్చాడంటూ చెప్పింది. ఇనయా సుల్తానా వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.