బిగ్ బాస్ తెలుగు సీజన్ 6.. ఈ రియాలిటీ షో ఎంతో ఉత్కంఠగా సాగుతోంది. మొదటిరోజు నుంచి గొడవలు, గ్రూపులు, టాస్కులతో ఇంట్లోని సభ్యులు ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేస్తున్నారు. మొదటివారం బాలాదిద్య కెప్టెన్ అయిన విషయం తెలిసిందే. అలాగే రెండో వారం కెప్టెన్ ఎవరో తెలుసుకునేందుకు మళ్లీ కెప్టెన్సీ పోటీదారుల టాస్కు, కెప్టెన్సీ కోసం టాస్కును పెడతారు. ఈసారి కెప్టెన్సీ కంటెంర్ల కోసం సిసింద్రీ అనే టాస్కును పెట్టారు. అందులో సభ్యులకు ఇచ్చిన బొమ్మను జాగ్రత్తగా చూసుకోవాలి. అజాగ్రత్తగా ఉంటే దానిని లాస్ట్ అండ్ ఫౌండ్ లో వేస్తారు. అయితే ఈ గేమ్‌లో అంతా ఎంతో కష్టపడి ఆడారు. చంటి, ఇనయా సుల్తానా, రాజశేఖర్, ఆర్జే సూర్య కెప్టెన్సీ కంటెండర్లుగా విజయం సాధించారు.
కానీ, అందరికంటే ముఖ్యంగా గీతూ రాయల్ బాగా ఆడింది. ఇంట్లోని సభ్యులు మొత్తాన్ని నిద్రపోనీకుండా చేసింది. ఆమె గేమ్ స్ట్రాటజీకి హౌస్‌మేట్స్ మొత్తం నోరెళ్లబెట్టారు. శ్రీసత్య అయితే ఒక్క అమ్మాయి అందరినీ ఆడిస్తోంది అంటూ కామెంట్ చేయడం, అభినయశ్రీ సైతం గీతూ చాలా బాగా ఆడుతోందంటూ పొగిడేసింది. ఇంక రేవంత్ విషయానికి వస్తే.. మొదటి నుంచి గీతూకి రేవంత్‌కి గొడవలు జరుగుతూనే ఉన్నాయి. అయితే ఆఖరికి రేవంత్ సైతం గీతూ చాలా గ్రేట్ ఎంతో అద్భుతంగా గేమ్ ఆడిందని పొగిడేశాడు. అంతేకాకుండా ప్రేక్షకుల విషయంలోనూ గీతూపై మంచి అభిప్రాయం ఏర్పడింది. మొదటివారంలో ఉన్న నెగెటివ్ అభిప్రాయం రెండో వారానికి వచ్చే సరికి మారిపోయింది.
వీళ్లు మాత్రమే కాదు.. హౌస్ మొత్తం గలాటా గీతూ ఈజ్ గ్రేట్ అంటూ కామెంట్ చేస్తున్నారు. మొదటివారంలో వరస్ట్ హౌస్‌మేట్ అని జైల్లో కూర్చోబెట్టిన సభ్యులు మొత్తం ఇప్పుడు గీతూ గ్రేట్ అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. ఆమె గేమ్ ప్లాన్, స్ట్రాటజీలు చూసి అందరూ నివ్వెరపోయారు. బొమ్మ విషయంలో గీతూ చూపించిన సమయస్ఫూర్తి, ఆమె స్ట్రాటజీలకు ఫిదా అయిపోయారు. మొత్తానికి చిత్తూరు చీతా అనిపించుకుంది. ఓటింగ్ విషయంలోనూ గీతూకి మంచి సపోర్ట్ లభిస్తోంది. అంతేకాకుండా ప్రతి విషయంలో గీతూ తీసే పాయింట్లు, ఆమె చెప్పే మాటలు అందరినీ ఆలోజింపచేస్తున్నాయి. ఆమె గేమ్ ఇదే స్థాయిలో కొనసాగితే రెండువారాల్లో ఎలిమినేట్ అవుతుందని భావించిన గీతూ రాయల్ తప్పకుండా టాప్ 5 కంటెండర్ అయ్యే అవకాశం లేకపోలేదు. మరి.. గీతూ గేమ్ ప్లాన్‌పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.