బిగ్ బాస్ 6వ సీజన్ కాస్త వెరైటీగా అనిపిస్తోంది. ఎందుకంటే హౌస్ మేట్స్ లో చాలామంది ఆడటం కంటే ఎంజాయ్ చేయడానికి వచ్చినట్లు కనిపిస్తున్నారు. హౌస్ట్ నాగార్జున కూడా అలాంటి వాళ్లపై సీరియస్ అయ్యేసరికి రూట్ మార్చారు. దానికి తోడు హౌసులో ఎప్పుడు పరిస్థితులు ఎలా మారతాయి? ఏం జరుగుతుందనేది అంచనా వేయడం చాలా కష్టం. మరి ముఖ్యంగా ఎలిమినేషన్ విషయంలో ప్రేక్షకుల అనుకున్నది ఒకటి, అక్కడ జరుగుతున్నది మరోలా ఉంటుంది. బిగ్ బాస్ ఆరో సీజన్ లో రూల్స్ విషయంలోనూ విచిత్రాలు జరుగుతున్నాయి.
బిగ్ బాస్ ప్రతి సీజన్ లోనూ.. కంటెస్టెంట్స్ వచ్చిన వారంలోనే ఎవరో ఒకరు ఎలిమినేట్ అయిపోయేవారు. కానీ ఈసారి అలా జరగలేదు. దీంతో అందరూ రిలాక్స్ అయిపోయారు. ఆడటం మర్చిపోయారు. ఇక సీరియస్ అయిన నాగ్.. రెండో వారం ఏకంగా ఇద్దరిని(అభియన, షానీ) బయటకు పంపేశాడు. ఇక మూడో వారం నేహా చౌదరి ఎలిమినేట్ అయినట్లు తెలుస్తోంది. ఇక నాలుగో వారానికి సంబంధించి సోమవారం నామినేషన్ ప్రక్రియ జరుగుతుంది. ఆటతీరు బట్టి ఇంటి సభ్యులు ఒక్కొక్కరిని నామినేట్ చేస్తారు. కెప్టెన్ ఆదిరెడ్డి మాత్రం ఇద్దరిని నామినేట్ చేయొచ్చు. ఇప్పుడు దానికంటే ముందు బిగ్ బాస్ నిర్వహకులు కొత్త రూల్ తీసుకొచ్చారు. ఏకంగా హౌస్ట్ నాగార్జునే.. వచ్చే వారం కోసం అర్జున్ కల్యాణ్, కీర్తి భట్ ని నామినేట్ చేసేశాడు. అందుకు సంబంధించిన ప్రక్రియ శనివారం ఎపిసోడ్ లో జరిగింది.
ఈ వారం సోఫా వెనకాల ఎనిమిది మందిని నిలబడ్డారు. అందులో ఇద్దరిని హోస్ట్ నాగార్జున నామినేట్ చేశాడు. కానీ ఆ ఇద్దరినీ ఎంచుకోవాల్సిన బాధ్యత, సోఫాలో కూర్చున్న వారికి అప్పజెప్పాడు. ఇంటిసభ్యులతో నిర్వహించిన ఓటింగ్ లో చంటికి 1, రాజ్ కు 4, బాలాదిత్యకు 3, అర్జున్ కి 5, వాసంతికి 2, రోహిత్-మెరీనాకు 1, సుదీపకి 3, కీర్తి భట్ కి 5 ఓట్లు వచ్చాయి. అత్యధిక ఓట్లు వచ్చిన అర్జున్, కీర్తి.. వచ్చే వారం నామినేషన్స్ లో ఉంటారని హోస్ట్ నాగార్జున క్లారిటీ ఇచ్చేశాడు. బిగ్ బాస్ చరిత్రలోనే కంటెస్టెంట్స్ ని హౌస్ట్ నామినేట్ చేయడం ఇదే తొలిసారి. ఇదంతా చూస్తుంటే ఈ సీజన్ లో ఇంకెన్ని కొత్త రూల్స్ వస్తాయో తెలియాల్సి ఉంది. మరి అర్జున్, కీర్తిని నాగ్ నామినేట్ చేయడంపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో పోస్ట్ చేయండి.
ఇదీ చదవండి: ప్రతి ప్రోమో-ఎపిసోడ్‌లో గీతూపైనే ఫోకస్.. ఆమె తప్ప ఎవరూ ఆడటం లేదా?