‘బిగ్ బాస్ తెలుగు సీజన్ 6’ రెండో రోజూ గలాటా గట్టిగానే మొదలైంది. ప్రస్తుతం నడుస్తున్న క్లాస్- మాస్- ట్రాష్ టాస్క్ తో హౌస్‌లో యుద్ధ వాతావరణం కనిపిస్తోంది. బిగ్ బాస్ నాన్ స్టాప్ తరహాలో డే 1 నుంచి రచ్చ, గొడవలు, గ్రూపులు కట్టడాలు షురూ అయిపోయాయి. ఈ టాస్కులో ట్రాష్ సెక్షన్‌లో ఉన్న గీతూ రాయల్‌కి క్లాస్ కేటగిరీకి మారింది. బాలాదిత్య ట్రాష్ సెక్షన్ నుంచి నుంచి స్వైప్ అయ్యేందుకు ఓకే అనడంతో గీతూ రాయల్ కి క్లాస్ సెక్షన్ దొరికింది. అలా అనౌన్స్ అయ్యీ అవ్వకుండానే గీతూ యాక్షన్ షురూ చేసింది. చేతికి బ్రాస్‌లెట్ పెట్టగానే సోఫాలో పుష్పలో అల్లు అర్జున్ స్టైల్‌లో కూర్చుంది.
క్లాస్ సెక్షన్‌లో ఉన్నవాళ్లు నామినేట్ కారు, వీఐపీ లాంజ్ యాక్సెస్ ఉంటుంది. అంతేకాకుండా వారికి ఇంకో విశేష అధికారం కూడా ఉంది. అదేంటంటే.. ఇంట్లోని ట్రాష్, మాస్ సెక్షన్ సభ్యులతో ఏ పని కావాలన్నా చేయించుకోవచ్చు. ఇప్పుడు ఆ అధికారాన్ని గీతూ రాయల్ గట్టిగా వాడుకుంటోంది. ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరికి పని చెబుతూ గీతూ రచ్చ మొదలు పెట్టేసింది. నా దువ్వెన తీసుకురండి, నాకు నిమ్మకాయ నీళ్లు ఇవ్వండి అంటూ ఆర్డర్లు పాస్ చేస్తోంది. ఆఖరికి స్వైప్ అయిన బాలాదిత్యను కూడా తమ్ముడు బాలా యాక్సెస్ కార్డు ఎక్కడా అంటూ అనేసింది. అయితే ఇంతకముందు ఉన్న క్లాస్ సెక్షన్ సభ్యులు ఎవరూ ఇంట్లో వారికి పనులు చెప్పలేదు.
కానీ, గలాటా గీతూ మాత్రం ఈ పవర్ ని పగ తీర్చుకోవడానికి కూడా వాడేసుకుంటుంది. ముఖ్యంగా ఇనయా సుల్తానాను టార్గెట్ చేసి గీతూ రాయల్ గేమ్ ఆడుతోంది. ఇనయా ఎక్కడున్నా తన దగ్గరికి పిలిపించుకుని మరీ పనులు చెబుతోంది. నాకు ఇమ్మకాయ పిండి నీళ్లు తీసుకురా అని చెప్పింది. ఆ తర్వాత ఎక్కడో ఉన్న ఆమెను పిలిపించి పాట పాడు అంటూ ఆర్డర్ వేసింది. అందుకు నో చెప్పడంతో నా దువ్వెన తీసుకురా అంటూ పంపింది. ఇనయా కూడా చాలా సీరియస్ అయ్యింది. పనులు చేయాలని ఉంది గానీ, ఎక్కడా పాటలు, రైమ్స్ పాడాలని లేదంటూ సీరియస్ అయ్యింది. ఇందరి విషయంలో గీతూ సరదాగా చేసినట్లు ఉన్నా కూడా ఒక్క ఇనయా విషయంలో మాత్రం ఆమెను టార్గెట్ చేస్తూ వచ్చింది.
గలాటా గీతూ ఇంట్లో అడుగుపెట్టిన దగ్గరి నుంచి చిత్తూరు యాసలో సందడి చేస్తోంది. అటు నెగెటివ్ కానివ్వండి ఇటు పాజిటివ్ కానివ్వండి గీతూ రాయల్ బాగా ఎలివేట్ అవుతోంది. కెమెరా ముందు మినిమం కంటెంట్ ఇస్తూ అలరిస్తోంది. అయితే ఈ మాదిరి ప్రవర్తన అనేది పులి మీద స్వారీ, కత్తి మీద సాము అంటారు కదా.. అలాంటిది అనమాట. ఈమె ప్రవర్తనను ప్రేక్షకులు పాజిటివ్‌గా తీసుకుంటే టాప్ 5, లేదా టాప్ 3 వరకు కూడా వెళ్లే అవకాశం ఉంటుంది. అదే ప్రేక్షకులకు చిరాకు వస్తే మాత్రం మొదటి వారంలో కూడా వెనక్కి వచ్చే ప్రమాదం లేకపోలేదు. కానీ, గీతూ విషయంలో మాత్రం బిగ్ బాస్‌కు గట్టిగానే వర్కౌట్ అవుతోంది. గీతూ రాయల్ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.