బిగ్ బాస్ తెలుగు సీజన్ 6.. చాలా ఉత్కంఠగా మారుతోంది. వారం కూడా గడవకుండానే హౌస్ మొత్తం యుద్ధ వాతావారణం నెలకొంది. ఒకరిపై ఒకరు ఆరోపణలు, విమర్శలు చేసుకుంటే కాస్త గ్యాప్ దొరికినా తెగ మాటలు అనేసుకుంటున్నారు. ఒకవేళ సంఖ్య ఎక్కవ ఉండటం కూడా ఒక కారణం కావొచ్చు. అయితే ఇంత మంది ఉన్నా కూడా ఎక్కువగా వారిలో రేవంత్- గీతూ రాయల్ బాగా హైలెట్ అవ్వడం చూస్తున్నాం. అయితే విమర్శలు సైతం వారిపైనే ఎక్కువ వస్తున్నాయి. తొలివారం నామినేషన్స్ లో రేవంత్ ఎక్కువ ఓట్లతో టాప్ ప్లేస్ లో ఉన్నాడు. అతను ఎక్కువ ఇన్వాల్వ్ అవ్వడమే ఇందుకు కారణమైంది. నిజానికి గీతూ క్లాస్ లో ఉండబట్టి బతికిపోయింది లేదంటే రేవంత్ తర్వాత ఆమెకే ఎక్కువ ఓట్లు వచ్చుండేవి.
అయితే రేవంత్- గీతూ రాయల్ విషయంలో ఎవరికీ ఒక విషయంపై క్లారిటీ రావడం లేదు. ఏంటంటే.. గీతూ రాయల్- రేవంత్‌కు సపోర్ట్ చేస్తోందా? లేక టార్గెట్ చేస్తోందా? అనే విషయంపై క్లారిటీ లేదు. మొదటి రోజు నుండి రేవంత్‌కు సపోర్టివ్‌గానే కనిపిస్తోంది. ఆమె కోసం రేవంత్ తన ఛాన్స్ వదులుకుని ఆమెను నేరుగా క్లాస్ కేటగిరీకి పంపాడు. ఆమె నామినేషన్స్ నుంచి సేవ్ అయ్యింది కూడా. రేవంత్ మాత్రం నామినేషన్స్ లో ఎక్కువ ఓట్లతో తొలివారం బయటకు వెళ్లే వారిలో టాప్ ప్లేస్ లో ఉన్నాడు. అంత త్యాగం చేసి తనకు ఆ ఛాన్స్ ఇచ్చిన రేవంత్ విషయంలో గీతూ రాయల్ మాట్లాడే మాటలు ప్రేక్షకులను ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి.
విషయం ఏంటంటే.. తాజాగా విడుదలైన బిగ్ బాస్ తెలుగు సీజన్ 6 ప్రోమోలో అసలు విషయం వెలుగు చూసింది. రేవంత్ అంతా తనని నామినేట్ చేశారని భావోద్వేగానికి గురయ్యాడు. అందరికీ దూరంగా బాధపడుతూ కూర్చున్నాడు. బాలాదిత్య అతడిని కూల్ చేసేందుకు ప్రయత్నించాడు. అయితే మరోవైపు గీతూ రాయల్ రేవంత్ గురించి చేస్తున్న కామెంట్లు వేరేలా ఉన్నాయి. “ఆ మనిషి ఎంత త్వరగా హౌస్ నుంచి వెళ్లిపోతే అతనికే మంచిది. లేదంటే అనవసరంగా క్యారెక్టర్ బ్యాడ్ అవుతుంది. ఆయన బిహేవిర్ మార్చుకోకుండా ఇలాగే ఉంట.. ఇంత గొప్ప సింగర్ ఇలా బిహేవ్ చేస్తున్నాడేంటి అంటూ అంతా మాట్లాడతారు” అంటూ గీతూ రాయల్ కామెంట్ చేసింది. రేవంత్ ఫ్యాన్స్ మాత్రం గీతూ డబుల్ గేమ్ ఆడుతోందంటున్నారు. ఇంకొందరు రేవంత్ మంచికోసమే చెప్పిందంటున్నారు. గీతూ రాయల్ వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.