సోషల్ మీడియా ద్వారా చాలా మంది మంచి గుర్తింపు సంపాందికున్నారు. అలా పాపులారిటీ దక్కించుకున్న వారిలో గలాటా గీతూ ఒకరు. చిత్తూరు యాసలో మాట్లాడుతూ అందరిని ఆకట్టుకుంది ఈ అమ్మడు. లైఫ్ కొటేషన్లతో, బిగ్ బాస్ రివ్యూలతో బాగా ఫేమస్ అయింది గీతూ రాయల్. టిక్ టాక్ వీడియోలు, ఇన్ స్టాగ్రామ్ రీల్స్ ,యూట్యూబ్ వీడియోలతో గీతూకి ఫుల్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది. ఈ ఫేమ్ తో జబర్ధస్త్ షోలోనూ పాల్గొన్ని అక్కడ తెగ సందడి చేస్తోంది. తాజాగా బిగ్ బాస్ సీజన్ 6కి ఈ అమ్మడు ఎంట్రీ ఇచ్చింది. షోలో ఎనిమిదో సభ్యురాలిగా గలాటా గీతూ హౌస్ లో అడుగుపెట్టింది. తన ప్రేమ కథతో కింగ్ నాగార్జనను కూడా కంగారు పెట్టేసింది.
గీతూ రాయల్ ఆంధ్రప్రదేశ్ లోని చిత్తూరులో జన్మించింది. ఆమె అక్కడే గ్రాడ్యూయేషన్ పూర్తి చేసింది. ఆమెతల్లిదండ్రులు శేఖర్, సుధారాజ్యం. తనకి హర్జతేజ అనే అన్న ఉన్నాడు. అతడికి వివాహం అయ్యింది. 2018లో రేడియో జాకీ గా గీతూ తన కెరీర్ హైదరాబాద్ లో ప్రారంభించింది. ‘గలాటా గీతు రాయల్’ అనే యూట్యూబ్ ఛానలో మోటివేషనల్ వీడియోలు చేస్తూ మంచి గుర్తింపు సంపాందించింది. ఈ క్రమంలోనే బిగ్ బాస్ రివ్యూ ఇవ్వస్తూ ఫేమస్ అయ్యింది. జబర్ధస్త్ షోలో రోహిణీ టీమ్ లో పాల్గొంది. అక్కడ తనదైన మాటలతో, యాస ఫుల్ కామెడీ పండిస్తుంది. అలా జబర్దస్త్ షో ద్వారా ఊహించని స్థాయిలో గలాటా గీతూ గుర్తింపును సొంతం చేసుకున్నారు.
లక్కీ లక్ష్మణ్, కల్ట్ గ్యాంగ్ అనే సినిమాలలో చిన్నపాత్రలో గీతూ నటించింది. ప్రస్తుతం అటు లేడీ కమెడియన్ గా గలాటా చేస్తోంది. అంతేకాకుండా ప్రస్తుతం సినిమా ఆఫర్లతో ఫుల్ బిజీగా ఉన్నట్లు చెప్పుకొచ్చింది. బిగ్ బాస్ గురించి రివ్యూలు చేసిన గీతూ రాయల్.. బిగ్ బాస్ సీజన్ 6లో సభ్యురాలిగా హౌస్ లో అడుగుపెట్టడం ఆసక్తిగా మారింది. తాను టాప్ 5గా నిలుస్తానంటూ ధీమా వ్యక్తం చేసింది. మరి.. బిగ్ బాస్ హౌస్ లో ఎంతమేరకు రాణిస్తుందో వేచి చూడాల్సిందే. బిగ్ బాస్ విన్నర్ గీతూ నే అంటూ ఆమె అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. మరి.. బిగ్ బాస్ హౌస్ లోకి గీతూరాయల్ ఎంట్రీ ఇవ్వడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
గీతూ రాయల్ ఇన్ స్టాగ్రామ్ ఐడీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.