బిగ్ బాస్ తెలుగు సీజన్ 6.. ఇప్పుడే అసలు హీట్ మొదలైంది. నామినేషన్స్, కెప్టెన్సీ పోటీదారుల టాస్క్ వీటిలో చూసిన దానికన్నా.. కెప్టెన్సీ టాస్కులో రచ్చ రచ్చ చేశారు. ఆదిరెడ్డి, గీతూ రాయల్, నేహా చౌదరి, బాలాదిత్య, మరీనా- రోహిత్, ఆర్జే సూర్యాలు తొలివారం కెప్టెన్సీ కోసం పోటీ పడ్డారు. వీళ్లకు సపోర్ట్ గా ఒక్కో ఇంటి సభ్యుడు సహాయం చేశారు. చాలా టఫ్ ఫైట్ తర్వాత తొలివారం కెప్టెన్‌గా హీరో బాలాదిత్య విజయం సాధించాడు. అతడికి కెప్టెన్సీ బ్యాడ్జ్ పెట్టి ఫస్ట్ కెప్టెన్‌గా ప్రకటించారు. అయితే ఈ టాస్క్ తర్వాత మొత్తం వారం గురించి రివ్యూ ఉంటుందన్న విషయం తెలిసిందే. ఆ రివ్యూ బెస్ట్ పర్ఫార్మర్, వరస్ట్ పర్ఫార్మర్ ని ఎంచుకోవాల్సి ఉంటుంది.
ఇది ప్రతి సీజన్లో జరిగే ప్రక్రియే.. అలా ఎందుకున్న సభ్యులను జైల్లో పెడతారు. దాదాపు రెండ్రోలపాటు వాళ్లు అక్కడే ఉండాలి. అయితే ఈ వారం ఇంట్లోని సభ్యుల్లో ఎక్కువ మంది ఆ వరస్ట్ పర్ఫార్మర్ అనే ఓటు బిగ్ బాస్ రివ్యూవర్ గీతూ రాయల్ కు వేశారు. గీతూ రాయల్‌ను వరస్ట్ పర్ఫార్మర్‌గా డిక్లేర్ చేసి బిగ్ బాస్‌కు చెప్పారు. బిగ్ బాస్ హౌస్‌లో ఈ సీజన్లో మొదటి గొడవ గీతూ రాయల్ వల్లే జరిగింది. వాష్ రూమ్ క్లీనింగ్ విషయంలో గీతూ రాయల్- ఇనయా సుల్తానాతో గొడవకు దిగింది. నాకు బాత్ రూమ్ క్లీనింగ్ డ్యూటీ ఇచ్చినా కూడా నేను చెయ్యను అంటూ చెప్పడం ఆమెకు బాగా నెగెటివ్ అయ్యింది. ఆ తర్వాత నుంచి గీతూ రాయల్ విషయంలో చాలా మంది ఇలా నెగెటివ్‌గానే రియాక్ట్ అయ్యారు.
ప్రేక్షకుల్లోనూ గీతూ రాయల్ విషయంలో నెగెటివ్‌గా రియాక్ట్ అవుతున్నారు. ఆమె కొన్ని విషయాల్లో హైపర్ అవుతోందంటూ కామెంట్ చేస్తున్నారు. అయితే ఈ విషయాలపై గీతూ సైతం స్పందించింది. బిగ్ బాస్‌తో మాట్లాడుతూ “నాలో కొన్ని మైనస్ పాయింట్స్ ఉన్నాయి. అవి మార్చుకోవాలి. నేను కూడా మార్చుకునేందుకు ప్రయత్నిస్తాను. అయితే వీళ్లకోసం నేను మారేదేంది? వీళ్లేమైనా నన్ను పెంచుతున్నారా? పోషిస్తున్నారా? అఫ్‌కోర్స్ ఇప్పుడు నువ్వు నన్ను పోషిస్తున్నావ్. నీకోసం కావాలంటే మారతాను” అంటూ గీతూ రాయల్ కెమెరాలతో మాట్లాడటం 24*7 స్ట్రీమింగ్‌లో చూశాం. అన్నీ కలిపి ఇప్పుడు గీతూ రాయల్ వరస్ట్ పర్ఫార్మర్‌గా జైల్లోకి వెళ్లేలా చేశాయి. గీతూ రాయల్ వరస్ట్ పర్ఫార్మర్ కావడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.