గత బిగ్ బాస్ సీజన్లతో పోలిస్తే ఈ సీజన్ లో కొంతమంది కంటిస్టెంట్లు తమ గేమ్ ఆడకుండా ఏదో నామమాత్రంగా షోకి వచ్చామన్నట్టు ఉంటున్నారు. ఈ విషయంలో నాగార్జున కూడా గట్టిగానే ఆగ్రహం వ్యక్తం చేశారు. టైం పాస్ కి వచ్చారా అంటూ కొంతమంది కంటిస్టెంట్స్ కి క్లాస్ పీకారు. బిగ్ బాస్ హౌస్ లో బాగా ఆడని వారిని, అసలు ఆడని వారిని సెపరేట్ అవ్వమని.. బాగా ఆడిన వారిని ప్రశంసిస్తూ.. ఆడని వారికి క్లాస్ పీకారు. ఈ క్రమంలో గలాటా గీతూని నాగ్ ప్రశంసలతో ముంచెత్తారు. వందకి రెండొందల శాతం ఆడావంటూ నాగ్ ప్రశంసించగా.. మీరు చూసింది కేవలం 20 శాతం మాత్రమే అంటూ గీతూ సమాధానమిచ్చింది. ఇక బాలాదిత్య గురించి మాట్లాడుతూ.. అందరికీ ఉపదేశాలు ఇవ్వడం మానేస్తే మంచిదని, నీ ఆట నువ్వు ఆడుకోవాలంటూ నాగ్ సూచించారు. దీంతో బాలాదిత్య డల్ అయ్యాడు. బాలాదిత్యని అలా చూసిన గీతూ.. ఉచిత సలహాలు ఇచ్చింది.
“ఇప్పుడు ప్రపంచంలో అందరూ రిచ్ అనుకో.. బాత్రూమ్ లు ఎవరు కడుగుతారు. చెప్పులెవరు కుడతారు? బట్టలెవరు కుడతారు? కాల్వలు ఎవరు క్లీన్ చేస్తారు? అర్థమైందా? ప్రపంచమంతా రిచ్ క్యాండిడేట్స్ అయితే ఉండలేరు. అన్ని రకాల వాళ్ళు ఉండాలి. అలానే బిగ్ బాస్ హౌస్ లో కూడా అందరూ సూపర్ కంటిస్టెంట్లు ఉంటే బయటకు ఎవరు పోతారు? మనం ఎవరినీ సూపర్ కంటిస్టెంట్ గా చేయాల్సిన అవసరం లేదు. అర్థమైందా? ఒకరి నెగిటివ్ ని పాజిటివ్ గా మార్చాల్సిన అవసరం లేదు. ప్రీచింగ్ అంటే అదే” అంటూ బాలాదిత్యకి ఉచిత సలహా ఇచ్చింది గీతూ. అర్ధమైంది అంటూ బాలాదిత్య అక్కడి నుంచి లేచి వెళ్ళిపోయాడు. అయితే ఇప్పుడు గీతూ చేసిన కామెంట్స్ వివాదాస్పదంగా మారేలా ఉన్నాయి. ఆమె చెప్పింది నిజమే అయినప్పటికీ చెప్పే విధానంలో కొన్ని వర్గాల పట్ల చిన్న చూపు ఉందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. బిగ్ బాస్ హౌస్ ని, వాస్తవిక ప్రపంచంతో పోల్చడమే కరెక్ట్ కాదని అంటున్నారు.
ప్రపంచమంతా అన్ని రకాల వాళ్ళు ఉండాలి అని చెప్పడం వరకూ బాగానే ఉంది. అందరూ ధనవంతులు అయితే చిన్న చిన్న పనులు ఎవరు చేస్తారు? ఈ విషయంలో గీతు కరెక్ట్ గానే మాట్లాడింది. ఆ తర్వాత మాట్లాడిన మాటలే ఆమెను వివాదంలోకి నెట్టేలా ఉన్నాయి. బిగ్ బాస్ హౌస్ లో ఉండే సూపర్ కంటిస్టెంట్లు రిచ్ క్యాండిడేట్స్ తోనూ, సాధారణ కంటిస్టెంట్లను ఈ శారీరక శ్రమ చేసుకునే వర్గాల వారితో పోల్చింది గీతూ. “మనం ఎవరినీ సూపర్ కంటిస్టెంట్ గా (రిచ్ గా) చేయాల్సిన అవసరం లేదు. ఒకరి నెగిటివ్ ని (దరిద్రాన్ని) మార్చాల్సిన అవసరం లేదు. అదే ధర్మోపదేశం” అని అర్థమొచ్చేలా మాట్లాడింది. అందరూ రిచ్ ఉండరు. ఇది అందరూ ఒప్పుకోవాల్సిందే. అయితే రిచ్ అవ్వాలని కలలు కనే వారికి సహాయం చేయకపోవడమే మానవత్వం అనిపించుకోదని గీతూపై విమర్శలు చేస్తున్నారు నెటిజన్లు.
బిగ్ బాస్ హౌస్ లో బతికినట్టు బయట బతికితే అదసలు బతుకే కాదని విమర్శిస్తున్నారు. ప్రపంచం నడవాలంటే అందరూ రిచ్ గా ఉండకూడదు. కానీ ప్రతీ ఒక్కరి పనికి తగ్గా గౌరవం, గౌరవ వేతనం ఉండాలి. అప్పుడే చిన్న వృత్తుల వారు ఎప్పుడూ తమని తాము చిన్న చూపు చూసుకోరు. అప్పుడే సమాజం బాగుంటుంది. అయితే ఎవరికి నచ్చిన పని వారు చేసుకునే స్వేచ్ఛ వారికి ఉంది. అలా కాకుండా నువ్వు ఇదే పని చేయాలి, నువ్వు ఎదిగేందుకు సహాయం చేయను అంటే అది కరెక్ట్ కాదు. ఈ విషయంలో గీతు చాలా పెద్ద సబ్జెక్ట్ ని టచ్ చేసిందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. పేదలని ఎదగనివ్వకూడదు అని అర్థమొచ్చేలా బిగ్ బాస్ హౌస్ సూపర్ కంటిస్టెంట్స్ కి, సాధారణ కంటిస్టెంట్స్ కి పోలిక పెట్టడమే ఇప్పుడు ఆమెను వివాదంలోకి నెట్టేసింది. దీంతో రియాలిటీ వేరు, రియాలిటీ షో వేరంటూ నెటిజన్లు ఆమెపై ఫైర్ అవుతున్నారు. మరి గీతూ చేసిన ఈ వ్యాఖ్యలపై మీ అభిప్రాయమేంటో కామెంట్ చేయండి.
Preaching definition by #Geetu 🤷🏻♂️
Best thing #BalaAditya did is left the conversation without any further comments👌🏼#BiggBossTelugu6pic.twitter.com/6m2NDKAZCS
— CommonMan🍥 (@TrulyCommonMan) September 18, 2022