నేహా చౌదరి.. ఈమె హాబీస్, చేసే పనులు, స్పెషలైజేషన్స్ ఇలా చెప్పుకుంటూ పోతే ఓ రోజు పడుతుంది. జాతీయస్థాయిలో జిమ్నాస్టిక్స్ లో ఛాంపియన్, స్టేట్ లెవల్లో స్విమ్మర్, యోగా ట్రైనర్, జిమ్ ట్రైనర్, సాఫ్ట్ వేర్ జాబ్, స్పోర్ట్స్ ప్రెజెంటర్, యాంకర్, మోడల్, డాన్సర్ ఇలా చాలానే ఉన్నాయి. కేవలం బిగ్ బాస్‌లో అడుగుపెట్టేందుకే ఆమె యాక్టింగ్ కెరీర్‌ను ప్రారంభించిందంట. అనుకున్నదే తడవుగా ఎట్టకేలకు బిగ్ బాస్ హౌస్‌లో నేహా చౌదరి అడుగుపెట్టింది. మొదటి రోజు నుండీ తనదైనశైలిలో దూసుకెళ్తున్న నేహా టాస్కుల్లో కూడా 100 శాతం ఎఫర్ట్ పెడుతోంది. రెండోరోజే టాస్క్ లో విన్ అయ్యింది. ఆ తర్వాత ఇనయా ఓడిపోయి బాధలో ఉంటే ఆమెను ఓదార్చి ప్రేక్షకుల్లో మంచి మార్కులు కొట్టేసింది.
నేహా చౌదరి గురించి చాలా మందికి తెలుసు.. కానీ, చాలా తక్కువగా తెలుసు. ఆమె వ్యక్తిగత జీవితం గురించి ఎక్కవ మందికి అవగాహన లేదు. బిగ్ బాస్ నేపథ్యంలోనే నేహా చౌదరి వ్యక్తిగత జీవితం గురించి పలు ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. నేహా తల్లి సైతం స్పోర్ట్స్ బ్యాగ్రౌండ్ ఉన్న వారే. ఆమె తల్లి కబడ్డీ, కోకో ఆడేవారు. ఆమెను చూసే నేహాకు క్రీడలపై ఆసక్తి పెరిగింది. ఆ తర్వాత జిమ్నాస్టిక్స్, స్పోర్ట్స్, స్టార్ స్పోర్ట్స్ ఛానల్‌లో తెలుగులో క్రీడల వ్యాఖ్యతగా రాణిస్తోంది. ఆమె గూగుల్‌లో సాఫ్ట్ వేర్ ఇంజినీర్‌గా సైతం జాబ్ చేసింది. ఒక యువతి ఇన్ని సాధించిందా అంటూ చాలా మంది ముక్కున వేలేసుకుంటున్నారు. అయితే ఇంకా పూర్తి కాలేదు.. నేను చేయాల్సినవి చాలా ఉన్నాయంటూ ఉంటుంది నేహా చౌదరి.
ఆమె వ్యక్తిగత జీవితంతో పాటుగా ఇప్పుడు నేహా చౌదరి టాటూస్ గురించి కూడా టాపిక్ వైరల్ గా మారింది. ప్రపంచంలో తనకి తల్లిదండ్రులు అంటే ఎంతో ప్రేమ అని చెప్పిన నేహా చౌదరి వారి పేర్లను టాటూగా వేయించుకుంది. అయితే ఆమె కుడికాలు పాదంపైన ఒక చిన్న లవ్ సింబల్ ఉంటుంది. అది చూసి ఆమె ఎవరికోసం వేయించుకుందబ్బా అని అంతా అనుకుంటూ ఉన్నారు. ఆ చిన్న టాటూపై పెద్ద చర్చే నడుస్తోంది. అయితే ఆ టాటూపై కూడా నేహా చౌదరి క్లారిటీ ఇచ్చింది. ఆమెకు తల్లిదండ్రుల తర్వాత ఇల్లే తన ప్రపంచం అని చెప్పుకొచ్చింది. అందుకు గుర్తుగా హౌస్ ఔట్‌లైన్‌లో లవ్ సిబంల్ వేయించుకుంది. అంటే ఐ లవ్ మై హోమ్ అని అర్థం అనమాట. బిగ్ బాస్ హౌస్‌లో నేహా చౌదరి గేమ్, ఆమె టాలెంట్‌పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.