రియాలిటీ షోలలో బిగ్ బాస్‌కు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. అన్ని భాషలతో పోలిస్తే తెలుగులో ఈ రియాలిటీ షో సూపర్ సక్సెస్ అయ్యిందనే చెప్పొచ్చు. బుల్లితెర ప్రేక్షకులను అలరించడంలో బిగ్ బాస్ ముందుంటుంది. అలాంటి షో 5 సీజన్లు పూర్తి చేసుకుని సక్సెస్ ఫుల్‌గా ఆరో సీజన్‌లోకి అడుగుపెట్టబోతోంది. సెప్టెంబర్ 4 నుంచి బిగ్ బాస్ తెలుగు సీజన్ 6 కూడా ప్రారంభం కానుంది.
ఈ సీజన్‌కు కూడా హోస్ట్ గా నాగార్జునానే వ్యవహరించనున్నాడు. ఈసారి హౌస్‌లోకి వెళ్లబోయేది వీళ్లే అంటూ కొందరి పేర్లు చక్కర్లు కొడుతున్న విషయం కూడా తెలిసిందే. రేవంత్, అభినయ, సుదీపా, బాలాదిత్య, చలాకి చంటి, నేహా చౌదరి, శ్రీహాన్, దీపిక పిల్లి, ఇయానా సుల్తానా, ఆదిరెడ్డి, రోహిత్-మరీనా, అర్జున్ కల్యాణ్, ఫైమా, రాజశేఖర్, గలాటా గీతు, శ్రీ సత్య, ట్రాన్స్ జెండర్ తన్మయ్, ఆర్జే సూర్య, ఆరోహీ రావ్, వసంతి పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి.
ఈ పేర్లు విన్నాక బిగ్ బాస్ తెలుగు సీజన్ 6 కచ్చితంగా ఇంట్రెస్టింగ్‌గా ఉండబోతోందని అందరికీ తెలుసు. దానిని ఇంకాస్త ఇంట్రెస్టింగ్‌గా మార్చేందుకు నిర్వాహకులు ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే ఈసారి బిగ్ బాస్ సీజన్‌లో సరికొత్త రూల్స్ ను తీసుకురాబోతున్నట్లు సమాచారం. గతంలో అయితే ఆదివారం ఒకరు ఎలిమినేట్ అవుతారు. ఆ తర్వాత సోమవారం నామినేషన్స్ ఉంటాయి. ఆ వారం పాటు అతను ఓట్లు సంపాదించుకునేందుకు కష్టపడుతుంటాడు.
ఈ సీజన్లో మాత్రం బుధవారం నుంచి నామినేషన్స్ పెట్టనున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా టాస్కులు కూడా చాలా టఫ్ ఉండబోతున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఇంట్లోని సభ్యులు ఆడే గేమ్స్, పాల్గొనే టాస్కులు అన్నీ ఫుల్ టఫ్‌గా ఉండనున్నట్లు చెబుతున్నారు. వారం చివర్లో వరస్ట్ పర్ఫార్మర్ ఒకరిని ఎంచుకోవాలి. అలా ఎంచుకున్న వారిని జైలులో పెట్టి పనిష్ చేస్తారు. ఆసారి ఆ పనిష్మెంట్లను కూడా కొత్తగా ఉండేలా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.
అన్ని భాషలతో పోలిస్తే తెలుగులో బిగ్ బాస్ ఆదరణ చాలా ఎక్కువ. అందుకే అంతే కొత్తగా షో ప్రెసెంట్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. అంతేకాకుండా బిగ్ బాస్ 6 హౌస్ గ్లింప్స్ కూడా రిలీజ్ చేశారు. ఈసారి బీబీ హౌస్ సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. 5 సీజన్ల కంటే ఎంతో భిన్నంగా, స్టైలిష్ గా బీబీ హౌస్ డిజైన్ చేశారు. రూల్స్ ని కూడా అంతే కొత్తగా ప్లాన్ చేసినట్లు గట్టిగానే టాక్ వినిపిస్తోంది. బిగ్ బాస్ సీజన్ 6పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.