బిగ్ బాస్.. హాలీవుడ్ నుంచి అందిపుచ్చుకున్న ఈ రియాలిటీ షో కాన్సెప్ట్ ఎంతో మందిని ఆకట్టుకుంటోంది. భారతదేశంలో మొదలుపెట్టిన అన్ని భాషల్లో సూపర్ సక్సెస్ అయ్యింది. ముఖ్యంగా తెలుగులో 5 సీజన్లు పూర్తి చేసుకుంది. ఓటీటీలో కూడా ఒక సీజన్‌ను సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ చేసుకుంది. ఇప్పుడు బిగ్ బాస్ తెలుగు సీజన్ 6కు ముహూర్తం ఖరారు చేశారు. ఇప్పటికే విడుదలైన ప్రోమోలు, కొత్త లోగో ఆకట్టుకుంటోంది.
ఈసారి కూడా నాగార్జునానే హోస్ట్ గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. సీజన్ 6 కోసం కింగ్ నాగార్జునకు భారీగానే రెమ్యూనరేషన్ ఆఫర్ చేసినట్లు తెలుస్తోంది. ఈ సీజన్‌కు దాదాపు రూ.15 కోట్ల వరకు తీసుకోనున్నట్లు టాక్ వినిపిస్తోంది. అంతేకాకుండా ఈసారి పాల్గొనేది వీళ్లే అంటూ కొంతమంది పేర్లు కూడా వైరల్ అవుతున్నాయి. ఇలా బిగ్ బాస్ కు సంబంధించిన ప్రతి విషయం హాట్ టాపిక్ గా మారింది.
ఈ నేపథ్యంలోనే తెలుగు ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సీజన్ 6 రిలీజ్ డేట్ కూడా వచ్చేసింది. బిగ్ బాస్ నిర్వాహకులు అధికారికంగా సీజన్ షురూ చేసే డేట్ ను ప్రకటించారు. తాజాగా విడుదల చేసిన ప్రోమోలో సెప్టెంబర్ 4 నుంచి బిగ్ బాస్ తెలుగు సీజన్ 6ను ప్రారంభించనున్నట్లు తెలిపారు. ఎంటర్‌టైన్మెంట్ అడ్డా ఫిక్స్ అంటూ నాగార్జున చెబుతున్నాడు. మరి.. ఈ సీజన్ ఏ మాత్రం సక్సెస్ అయ్యిద్దో వేచి చూడాలి. బిగ్ బాస్ సీజన్ 6పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.