బిగ్ బాస్ తెలుగు సీజన్-6.. ఇప్పుడు బుల్లితెర ప్రేక్షకులంతా ఈ రియాలిటీ షో ఎప్పుడు మొదలవుతుందా అని ఎదురుచూపులు ప్రారంభించారు. కొత్త లోగే, ప్రోమో రిలీజ్ చేశాక ఆ ఎదురుచూపులు ఇంకా పెరిగాయి. వాటి నేపథ్యంలోనే బిగ్ బాస్ తెలుగు సీజన్ 6పై నెట్టింట సెర్చ్, ఆసక్తి పెరిగిపోయింది. ఇటీవలే షోలో పాల్గొనే వాళ్ల లిస్ట్ అంటూ కొందరి పేర్లు వైరల్ గా మారాయి.
సెప్టెంబర్-4న బిగ్ బాస్ తెలుగు సీజన్ 6 ప్రారంభం కానున్నట్లు బల్లగుద్ది చెబుతున్నారు. అంతేకాకుండా ఉదయభాను, నేహా చౌదరి, గీతూ రాయల్, శ్రీహాన్, చలాకీ చంటి, ఆదిరెడ్డి, జబర్దస్త్ అప్పారావు వంటి పేర్లు బాగా వినిపిస్తున్నాయి. మొత్తం 19 మంది కాగా వారిలో 15 మంది ప్రారంభం రోజు వెళ్లగా మిగిలిన నలుగురు మాత్రం వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా వెళ్లనున్నట్లు చెబుతున్నారు.
ఈ నేపథ్యంలోనే ఇప్పుడు హోస్ట్ నాగార్జున గురించి కూడా ఓ వార్త వైరల్ గా మారింది. బిగ్ బాస్ తెలుగు సీజన్ 3 నుంచి కింగ్ నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. ప్రేక్షకులు ఆయన ప్లేస్ లో ఇంకొకరిని ఊహించుకోలేరోమో అన్నట్లుగా ఉంది పరిస్థితి. అందుకేనేమో ఈ సీజన్ కూడా నాగార్జునానే హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు. కొత్త ప్రోమో కూడా నెట్టింట వైరల్ గా మారింది.
ఇప్పుడు కింగ్ నాగార్జున సీజన్ 6 రెమ్యూనరేషన్ పై ఊహాగానాలు మొదలయ్యాయి. గత సీజన్ కోసం దాదాపు రూ.12 కోట్ల వరకు తీసుకున్న నాగార్జున ఇప్పుడు సీజన్ 6 కోసం పారితోషకం బాగానే పెంచేసినట్లు చెబుతున్నారు. బిగ్ బాస్ తెలుగు సీజన్ 6కి నాగార్జునకు దాదాపు రూ.15 కోట్లు వరకు రెమ్యూనరేషన్ గా ఇస్తున్నట్లు తెలుస్తోంది. నాగార్జునకి ఉన్న రేంజ్‌కి క్రేజ్‌కి ఆ మాత్రం ఇవ్వాల్సిందే అంటూ ఫ్యాన్స్ చెబుతున్నారు. నాగార్జున రెమ్యూనరేషన్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.