తెలుగులో అతి పెద్ద రియాలిటీ షో బిగ్‌బాస్ సీజన్ 6 ఆదివారం ప్రారంభమైంది. ఎంతో అట్టహాసంగా.. మోస్ట్ కలర్‌ఫుల్ ఈవెంట్‌గా ప్రారంభమైన ఈ కార్యక్రమానికి బ్రహాస్త్ర జోడి, రియల్ కపుల్ రణ్‌బీర్ కపూర్-ఆలియా భట్ హాజరయ్యారు. ఈ సీజన్‌కి కూడా నాగార్జుననే హోస్ట్‌గా వ్యవహరించబోతున్నాడు. గత సీజన్‌లకు భిన్నంగా ఈ సారి బిగ్‌బాస్ హౌస్ ఎంతో కలర్‌ఫుల్‌గా కనిపించింది. అయితే ఈ సారి ఏకంగా 21 మంది కంటెస్టెంట్స్‌ని హౌస్‌లోకి పంపించారు. వీరిలో ఒక రియల్ లైఫ్ కపుల్ కూడా ఉంది. ఇక బిగ్ బాస్ హౌస్ చూడటానికి ఎంతో పెద్దగా ఉన్నా గదులు మాత్రం చాలా చిన్నగా ఉన్నట్లు కనిపిస్తోంది. ఇక బెడ్రూం మరి దారుణంగా ఉంది.
ఈ సారి 21 మందిని హౌస్‌లోకి పంపించారు. కానీ కేవలం 8 బెడ్లను మాత్రమే ఏర్పాటు చేశారు. ఇక 21మందిలో ఒక కపుల్ ఉండటంతో వారిద్దరికి ఒక బెడ్ ఇవ్వగా.. మిగిలిన 19 మందికి.. ఉన్నది 7 బెడ్లు మాత్రమే. ఇక బెడ్‌కు ఇద్దరు అడ్జెస్ట్ అయినా.. మరో ఐదుగురు మిగులుతారు. ఇక తప్పనిసరి పరిస్థితుల్లో మొదటి రోజే ఆర్జే సూర్య, చలాకీ చంటి, షానీ సల్మాన్‌లు కిందపడుకోవాడినిక రెడీ అయ్యారు. ఇక అభినయ శ్రీ బెడ్ దొరక్క బయట కూర్చిండిపోయింది. వీరిని చూసిన వారికి హాస్టల్ జీవితం గుర్తుకు వచ్చింది. అక్కడ కూడా గదుల్లో 3, 4 కుదిరితే 5గురిని కూడా ఉంచుతారు. ఇప్పుడు బిగ్‌బాస్ హౌస్‌ను చూసినవారికి కూడా ఇదే పరిస్థితి గుర్తుకు వస్తుంది.
ఇక బెడ్ దొరక్క మిగిలిన కంటెస్టెంట్ల పరిస్థితి ఏంటి.. ఎక్కడ పడుకుంటారు.. ఎలా అడ్జెస్ట్ అవుతారో చూసేవారికి.. అటూ కంటెస్టెంట్స్‌కి అర్థం కాలేదు. కానీ బిగ్‌బాస్ షో గురించి పూర్తిగా తెలిసిన వారు మాత్రం.. ఇది కూడా గేమ్ స్ట్రాటజీనే అంటున్నారు. కంటెస్టెంట్స్‌కి మొదటి రోజు నుంచే బిగ్‌బాస్ చుక్కలు చూపించనున్నట్లు అర్థం అవుతోంది. ఇక బెడ్ కోసం కూడా కంటెస్టెంట్ల మధ్య గొడవలు పెట్టి.. షోని రక్తి కట్టించే పనిలో ఉన్నట్లు అర్థం అవుతోంది.
ఇక బెడ్ కోసం కూడా కంటెస్టెంట్‌లకు టాస్క్‌లు ఇవ్వడం, లేదంటే ఎలిమినేషన్ స్ట్రాటజీని ఉపయోగించడం.. చేస్తాడేమో చూడాలి బిగ్‌బాస్ అంటున్నారు ప్రేక్షకులు. లేదంటే కంటెస్టెంట్ల మైండ్ సెట్‌ని పరీక్షించడం కోసమే ఇలా బెడ్స్‌ని సెట్ చేసి ఉంటాడు.. పరిస్థితులను బట్టి అడ్జెస్ట్ అయ్యేవాళ్లు ఎవరు అని తెలుసుకోవడం కోసం బిగ్‌బాస్ ఇలా బెడ్స్ సెట్ చేశాడని అంటున్నారు ప్రేక్షకులు. మరి ఈ బెడ్ల విషయంలో బిగ్‌బాస్ ఏం చేయబోతున్నాడో ఫస్ట్ డే తెలిసిపోతుంది. దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.