బిగ్ బాస్ తెలుగు సీజన్ 6.. గత వీకెండ్ ఎపిసోడ్‌కి మాత్రం బాగా హైప్ వచ్చింది. ఎందుకంటే ఈ వారం గీతూ రాయల్ ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చేసింది కాబట్టి. గీతూ రాయల్ ఎలిమినేషన్ అనే వార్త బయటకు రాగానే అందరూ షాకయ్యారు. గీతూ అంటే చాలా మందికి నెగెటివ్ అభిప్రాయం ఉన్న మాట వాస్తవమే. కానీ, గీతూ రాయల్ లేకపోతే హౌస్‌లో గేమ్ ఉండదు అని కూడా అంటున్నారు. బాలాదిత్య విషయంలో గీతూ రాయల్ బాగా నెగెటివిటీ మూటగట్టుకుంది. బాలాదిత్య వీక్‌నెస్ రెండుసార్లు ఆడుకునే సరికి ప్రేక్షకులు బాగా సీరియస్ అయ్యారు. గతంలో నుంచి ఆమె ఉన్న అభిప్రాయం ఆ ఘటనతో మరింత బలపడింది. బిగ్ బాస్ కూడా షో మీద నెగిటివిటీని తగ్గించుకోవడం కోసమే గీతూని పంపేశారని కూడా టాక్ నడుస్తోంది.
అయితే గీతూ రాయల్ ఎలిమినేషన్ అని విన్న దగ్గరి నుంచి ఏడుపు మొదలు పెట్టింది. అసలు ఆమె విన్నర్ అనుకుంటూ ఇన్నాళ్లూ ఉంటే తొమ్మిదో వారంలో పంపేయడంతో మెంటల్‌గా బాగా డిస్టర్బ్ అయ్యింది. బిగ్ బాస్ ఐ లవ్‌యూ అంటూ కన్నీళ్లు పెట్టుకుంది. బిగ్ బాస్ సెట్‌ని ముద్దు పెట్టుకుంది. గీతూ రాయల్ వెళ్లిపోతోంది అనగానే ఇంట్లోని సభ్యులు కూడా ఫుల్‌గా ఏడ్చేశారు. స్టేజ్ మీద కూడా గీతూ ఏడుస్తూనే ఉంది. యాంకర్ శివకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కూడా ఏడుస్తూనే ఉంది. అలా ఈ వీకెండ్ ఎపిసోడ్‌లో గీతూ రాయల్ మొత్తం ప్రేక్షకులను ఏడిపించేసింది. అయితే ఇప్పుడు షో పరిస్థితి ఏంటి? అనే ఒక చిక్కుముడి ఇంకా వాళ్ల ముందు ఉంది.
నిజానికి గీతూ రాయల్ ఒక్కతి చాలు షో కాస్త ఇంట్రెస్టింగా సాగడానికి అనుకున్నారు. అనుకున్నట్లుగానే గీతూ, రేవంత్, ఇనయా వంటి వాళ్లు వాళ్ల శక్తి మేరకు కొట్లాటలు పెట్టుకుంటూ ఆటను రక్తి కట్టిస్తున్నారు. అయితే ఇప్పుడు గీతూ రాయల్ వెళ్లిపోవడంతో కాస్త గ్యాప్ ఉన్నట్లుగా కనిపిస్తోంది. అటు ప్రేక్షకులు కూడా ఇంట్లోని సభ్యులు ఎవరూ గీతూని మ్యాచ్ చేయలేరని మెంటల్‌గా ఫిక్స్ అయిపోయారు కూడా. అందుకే ఇప్పుడు బిగ్ బాస్ యాజమాన్యం గీతూ రాయల్‌కి ప్రత్యామ్నాయం కోసం వెతుకులాట మొదలు పెట్టారని తెలుస్తోంది. ఎలాగైనా ఆమెకు తగ్గ వారిని వీలైనంత త్వరగా హౌస్‌లోకి పంపేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. వైల్డ్ కార్డ్ ఎంట్రీతో గత సీజన్‌లో కనిపించిన వారిని లేదా కొత్త వారైనా కాస్త పేరున్న వాళ్లని పంపేందుకు సిద్ధమైనట్లు సమాచారం. గీతూలా ఎలాగైనా గెలవాలి అనే మైండ్ సెట్ ఉన్న వారిని తీసుకొస్తున్నట్లు చెబుతున్నారు.