బిగ్ బాస్ తెలుగు సీజన్ 6.. ప్రస్తుతం ఈ షో అలా అలా సాగుతోంది. అయితే ఈ షోలో కొందరి పేర్లు మాత్రం బాగా వినిపిస్తూ ఉన్నాయి. వాటిలో ముఖ్యంగా వినిపించే పేర్లు అర్జున్ కల్యాణ్- శ్రీ సత్య. మనోడికి శ్రీ సత్య మీద ఫీలింగ్స్ ఉన్నాయని ప్రేక్షకులే కాదు.. హౌస్ మొత్తం కూడా కోడై కూస్తోంది. అర్జున్ మాత్రం శ్రీ సత్య మాట్లాడితే చాలు, నవ్వితే చాలు, నన్ను చూస్తే చాలు అన్నట్లుగా వెనకే తిరుగుతూ ఉన్నాడు. ఆమె మాత్రం ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచుతోంది. ఆమెకు అవసరం వచ్చినప్పుడు భుజాల మీద చేతులు వేసినా పర్లేదు. కానీ, అవసరం లేకపోతే పొరపాటున చేయి తగిలినా కూడా అర్జున్ ఒక పర్వర్ట్ అనే రేంజ్‌లో బిహేవ్ చేస్తోంది. తాజాగా జరిగిన టాస్కులో అయితే తన దగ్గర ఉన్న డబ్బంతా శ్రీ సత్యకు ముట్టజెప్పి వరస్ట్ పర్ఫార్మర్ గా రెండోసారి జైలుకు వెళ్లాడు.
అసలు మనోడు హౌస్‌లోకి వచ్చింది గేమ్ ఆడటానికో? శ్రీ సత్యకు సేవలు చేయడం, ఆమె భజన చేయడానికో అర్థం కాదు. అయితే హౌస్‌లోకి రాకముందు అర్జున్ కల్యాణ్ కు ఒక బ్రేకప్ స్టోరీ ఉందని అందరికీ తెలుసు. చాలా సందర్భాల్లో ఆమె ఎవరు? ఎందుకు విడిపోయారు? వాళ్ల మధ్య ఏం జరిగింది? అనే విషయాలు బయకి రాకుండా ఇన్ డైరెక్ట్ గా ఏవేవో చెబుతూ వచ్చాడు. అయితే ఇప్పుడు ఆ మాజీ ప్రేయసే డైరెక్టుగా కామెంట్ చేసింది. అవును నేను- అర్జున్ కల్యాణ్ డేటింగ్ చేశాం అని కుండబద్దలు కొట్టేసింది. ఆమె మరెవరో కాదు.. నటి పూజిత పొన్నాడ. అవును మేమిద్దరం ప్రేమించుకున్నాం అంటూ అసలు విషయం బయటపెట్టింది.
“నేను అర్జున్ కలిసి చాలా ప్రాజెక్టులు చేశాం. ఒకరంటే ఒకరికి ఇష్టం కలిగింది. అర్జున్ ప్రపోజ్ చేశాడు. నేను ఓకే చేశాను. ఆ తర్వాత ఇద్దరం కొన్నాళ్లు డేటింగ్ చేశాం. నేను ఇప్పుడైతే సింగిల్‌గానే ఉన్నాను. మేమిద్దరం మాట్లాడుకుని విడిపోయాం. అది జరిగి కూడా చాలా కాలం అయ్యింది. అతను ఇప్పుడు బిగ్ బాస్‌లో ఉన్నాడు కాబట్టి ఆల్ ది బెస్ట్ చెప్తున్నా. మా రిలేషన్ కొనసాగుతూనే ఉంది. మేమిద్దరం అప్పుడప్పుడు మాట్లాడుకుంటూనే ఉంటాం. మేం విడిపోయాం గానీ, మా మధ్య రిలేషన్ అయితే పోలేదు” అంటూ పూజిత పొన్నాడ చెప్పుకొచ్చింది. అయితే అర్జున్ కల్యాణ్- శ్రీ సత్య వెనుక తిరుగుతున్న తీరు చూసి ప్రేక్షకులు అంతా ఇతను పెద్ద పులిహోర రాజాలా ఉన్నాడు. కేవలం శ్రీ సత్య కోసమే హౌస్‌లోకి వచ్చాడు అనుకుంట అంటూ కామెంట్ చేస్తున్నారు.