బిగ్ బాస్ నుంచి మరో మంచి కంటెస్టెంట్ బయటకొచ్చేశాడు. ఇప్పటికే అర్ధమైందనుకుంటా కదా. అవును ఆర్జే సూర్య మంచి ఛాన్స్ మిస్ చేసుకున్నాడు. తనకు వచ్చిన అద్భుతమైన అవకాశాన్ని పట్టించుకోకుండా.. ఆటపై దృష్టిపెట్టకుండా అమ్మాయిలతో పులిహోర కలిపాడు. సరిగ్గా దృష్టి పెట్టి ఆడుతుంటే టాప్-5లో ఉండేవాడు. కానీ ఆటపై కటే అమ్మాయిలపై ఎక్కువ కాన్సన్ ట్రేట్ చేశాడు. దీంతో బిగ్ బాస్ సూర్యపై దృష్టిపెట్టి బయటకు పంపేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం సోషల్ మీడియా మొత్తం ఈ విషయమే హాట్ టాపిక్ గా మారింది.
ఇక వివరాల్లోకి వెళ్తే.. ప్రస్తుతం జరుగుతున్న బిగ్ బాస్ ఆరో సీజన్ లో ఏకంగా 21 మంది పాల్గొన్నారు. అందులో కొందరు మినహా మిగతా ఎవరూ కూడా వ్యూయర్స్ కి తెలియదు. సింగర్ రేవంత్, గీతూతోపాటు కొండబాబు అలియాస్ ఆర్జే సూర్య కూడా చాలామంది తెలిసిన వ్యక్తి. మిమిక్రీ చేయడంలో మనోడు సూపర్ టాలెంటెడ్. కానీ తనలోని ఆ విలక్షణ నటుడిని చూపించి ఉంటే కచ్చితంగా ఫైనల్ కి వెళ్లేవాడు. అది జరగకపోగా, మొన్నటిమొన్నటి వరకు ఆరోహి, ప్రస్తుతం ఇనయాతో పులిహోర కలుపుతూ టైం వేస్ట్ చేశాడు. దీంతో బిగ్ బాస్.. ఆర్జే సూర్యని ఇంటికి పంపేసినట్లు తెలుస్తోంది.
వంట, కిచెన్, ఫిజికల్ టాస్క్, ఎంటర్ టైన్ మెంట్.. ఇలా బిగ్ బాస్ ప్రారంభమైన కొత్తలో బాగానే కష్టపడ్డాడు. మంచి పేరు కూడా తెచ్చుకున్నాడు. ఫెమినిస్ట్ అని చెప్పి కొన్నిసార్లు ఆడవాళ్లకు సపోర్ట్ కూడా చేశాడు. ఆ తర్వాత ఆరోహితో రిలేషన్ షిప్ మెంటైన్ చేశాడు. వీళ్లిద్దరి జంటని తట్టుకోలేక..ఆరోహిని ప్రేక్షకులు ఎలిమినేట్ చేసి పంపేశారు. ఆమె వెళ్లిపోవడంతో ఇనయా-సూర్య బాండింగ్ పెరిగిపోయింది. దీంతో సూర్య ఫెర్ఫామెన్స్ చేస్తే తగ్గుతూ వచ్చింది. మొత్తంగా మంచి పేరుతో హౌసులో అడుగుపెట్టిన సూర్య.. అదంతా పోగొట్టుకున్నట్లు తెలుస్తోంది. మరి సూర్య ఎలిమినేట్ అయిపోయాడనే వార్తలపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో పోస్ట్ చేయండి.
Bye Bye Feminist…
Ne energy ni game kakunda schemes lo pettav final ga bayataku vachav….#BiggBossTelugu6 #RJSurya pic.twitter.com/xq0DyT5HTB— Vamc Krishna (@lyf_a_zindagi) October 29, 2022