Bigg Boss 6 Telugu: బిగ్‌బాగ్ షోకు రోజు రోజుకు ప్రేక్షకాధరణ పెరుగుతోంది. మొదట్లో కొంత బోరింగ్‌గా అనిపించినా.. రానురాను షో రసవత్తరంగా మారుతోంది. కంటెస్టెంట్ల మధ్య గొడవలు, ప్రేమలు, బాధలు ప్రేక్షకుల్ని షోకు మరింత చేరువ చేస్తున్నాయి. ఒక్కోసారి ఒక్కో కంటెస్టెంట్ తన యాటిట్యూడ్‌తో షోలో హైలెట్‌గా నిలుస్తున్నారు. బిగ్‌బాస్ షో ఇప్పటికే ఓ వారంపూర్తి చేసుకుంది. అయితే, ఎలిమేషన్ మాత్రం లేకుండా పోయింది. డేంజర్ జోన్‌లో ఉన్న కంటెస్టెంట్లు సేఫ్ అయ్యారు. ఇప్పుడు రెండో వారం నడుస్తోంది. ఇక, రెండో వారం కెప్టెన్‌గా మోడల్ రాజశేఖర్ ఎన్నికైనట్లు తెలుస్తోంది.
రెండో వారం కెప్టెన్ ఎవరు అనే దానిపై తాజాగా, కెప్టెన్సీ టాస్క్ జరిగింది. ఆ టాస్క్‌లో కంటెండర్‌లుగా చలాకీ చంటి, ఆర్జే సూర్య, ఇనయా సుల్తానా, మోడల్ రాజశేఖర్‌లు నిలిచారు. వీరికి ఓటింగ్ చేయటానికి బిగ్‌బాస్ ఇంటి సభ్యులకు నాచో నాచో టాస్క్ ఇచ్చారు. ఇందులో భాగంగా అందరూ పాటలకు డ్యాన్స్ చేస్తూ ఉన్నారు. పాట ఆగిన ప్రతీసారి ఓ ఇద్దరు పేర్లను పిలిచారు. ఆ ఇద్దరూ ఏకాభిప్రాయంతో ఓ డీజేగా ఉన్న కంటెండర్ల పేరు చెప్పారు. అలా ఎక్కువ మంది మోడల్ రాజశేఖర్‌కు ఓట్లు వేశారు. దీంతో రెండో వారం కెప్టెన్‌గా రాజశేఖర్ గెలిచాడు.
కాగా, బిగ్‌బాస్ షోకు రేటింగ్ బాగా తగ్గిపోయినట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. గతంతో పోలిస్తే బాగా డౌన్ అయినట్లు తెలుస్తోంది. ప్రారంభ ఎపిసోడ్‌కే దారుణమైన రేటింగ్ వచ్చినట్లు సమాచారం. ఎన్టీఆర్ హోస్టుగా చేసిన తొలి సీజన్ ప్రారంభ ఎపిసోడ్‌కు 16.18 రేటింగ్ రాగా.. నాని హోస్టుగా చేసిన రెండో సీజన్ ఫస్ట్ ఎపిసోడ్‌కు 15.05 రేటింగ్ వచ్చింది. తర్వాత నాగార్జున హోస్ట్ చేసిన మూడు, నాలుగు, ఐదు సీజన్ల ప్రారంభ ఎపిసోడ్లకు 17.9, 18.5, 15.71 రేటింగ్స్ వచ్చాయి. అయితే తాజాగా మొదలైన ఆరో సీజన్ స్టార్టింగ్ ఎపిసోడ్ కి మాత్రం 8.86 రేటింగ్ వచ్చినట్లు తెలుస్తోంది.
ఇవి కూడా చదవండి : పాప కోసం పడిన కష్టం చెప్పుకుని ఏడ్చేసిన రోహిత్- మెరీనా.. 6 నెలలు గడుస్తున్నా బిడ్డకు..!