బిగ్ బాస్ అంటే చాలు. సీజన్ ఏదైనా సరే గొడవలు గ్యారంటీ. గత సీజన్ల నుంచి చూసుకుంటే.. షో ప్రారంభమైనా కొన్నిరోజులకు మెల్లగా టాస్కులు, గొడవలు మొదలయ్యేవి. కానీ ఇప్పుడు మొత్తం సీనే మారిపోయింది. ఏకంగా ఇంట్లో అడుగుపెట్టిన తర్వాతి రోజే.. పార్టిసిపెంట్స్ మాట మాట అనుకునేంత వరకు వెళ్లిపోయారు. దీనికి తోడు బిగ్ బాస్ ఇచ్చిన తొలి టాస్క్ కూడా గొడవల్ని ఇంకా ముదిరేలా చేస్తోందనడంలో ఎలాంటి సందేహం లేదు. అందుకు సంబంధించిన ప్రోమో కూడా ఇప్పుడు వైరల్ గా మారింది.
ఇక వివరాల్లోకి వెళ్తే.. ఈసారి బిగ్ బాస్ హౌస్ లోకి ఈసారి ఏకంగా 21 మంది సభ్యులు అడుగుపెట్టారు. ఇందులో అమ్మాయిలే 11 మంది ఉండటం విశేషం. ఇక రెండో రోజు పక్కా లోకల్ సాంగ్ తో మార్నింగ్ రొటీన్ స్టార్ట్ చేసిన ఇంటి సభ్యులు.. డ్యాన్స్ తో ఆకట్టుకున్నారు. ఇక ఆ వెంటనే గొడవ మొదలైపోయింది. ‘ఎవరిక్కడ స్నానం చేశారు. ఫుల్ జుత్తంతా ఉంది’ అని గీతూ గట్టిగా అడిగింది. ఎవరో ఇనయా పేరు చెప్పగా.. ఆమె దగ్గరికి వెళ్లి అడగింది. దీంతో అందరం డ్యూటీస్ ప్లాన్ చేసుకోవాలని ఇనయా అభిప్రాయపడింది. ఏ పనిచ్చినా చేస్తాను గానీ బాత్రూంలో వేరే వాళ్ల జుత్తు మాత్రం తీయనని గీతూ తెగేసి చెప్పింది.
దీంతో ఫైర్ అయిన ఇనయా.. ‘నా హెయిర్ ఒకటే ఉందని గ్యారంటీ ఏంటి. నిన్న నైట్ చాలామంది స్నానం చేశారు కదా వాళ్లది కూడా అయి ఉంటుంది. నన్నే ఎలా బ్లేమ్ చేస్తారు’ అని ఇనయా తిరిగి వాదించింది. ఆ తర్వాత తిక్క అనే పదం ఉపయోగించి ఇద్దరూ కౌంటర్స్ వేసుకున్నారు. ఇక బిగ్ బాస్ 6లో మొదటి టాస్క్ కి సమయం ఆసన్నమైంది అని ఫైమా దాని గురించి చదివింది. దీని ప్రకారం క్లాస్, మాస్, ట్రాష్ గ్రూప్స్. వాటిలోని విషయాల గురించి పూర్తిగా వివరించింది. ఈ మూడింటిలోనూ ఎవరెవరు ఉండాలనేది ఇంటి సభ్యులే నిర్ణయించుకోవాలని కూడా బిగ్ బాస్ అన్నారు. దీంతో అసలు గొడవ స్టార్టయిపోయింది. రేవంత్, ఇనయా ట్రాష్ గ్రూప్ లో ఉన్నట్లు ప్రోమోలో చూపించారు. దీన్నిబట్టి వాళ్లు డైరెక్ట్ నామినేషన్ లోకి వెళ్లిపోయారు. ఇక ఇనయా-గీతూ మధ్య గొడవ గురించి మీరేం అనుకుంటున్నారు. మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో పోస్ట్ చేయండి.
ఇదీ చదవండి: బిగ్ బాస్-6 మొదటి టాస్క్ లోనే భారీ రచ్చ? ఆ ప్లేస్ కోసం కొట్టుకోబోతున్నారా?