బిగ్ బాస్ 6 తెలుగు మెల్లమెల్లగా జనాలకు అలవాటవుతోంది. ఈ షో అంటేనే గొడవలు, హగ్గులు, ముద్దులు.. ఇలా అన్ని ఉంటాయి. రోజురోజుకి అవి ఒక్కొక్కటిగా జరుగుతున్నాయి. ఇక ఈ సీజన్ తొలి కెప్టెన్ గా బాలాదిత్య, వరస్ట్ ఫెర్ఫార్మర్ గా గీతూ నామినేట్ అయ్యారు. అంతా బానే ఉంది. దీంతో తొలివారం ఎలిమినేట్ అయ్యే పర్సన్ ఎవరా అని అందరికీ ఒకటే డౌట్. ఇప్పుడా వ్యక్తి ఎవరో తెలిసిపోయింది! ఇక వివరాల్లోకి వెళ్తే.. ట్రాష్-మాస్-క్లాష్ టాస్కుతో మొదలైన బిగ్ బాస్ ఆరో సీజన్ వీకెండ్ ఎపిసోడ్ కి రెడీ అయిపోయింది. మొత్తం 21 మందిలో 7 మంది ఎలిమినేషన్ కోసం నామినేట్ అయ్యారు.
నామినేట్ అయిన వారిలో రేవంత్, చంటి, ఫైమా, శ్రీసత్య, ఇనయా సుల్తానా, ఆరోహి, అభినయ శ్రీ ఉన్నారు. ఇందులో రేవంత్ స్ట్రాంగ్ కంటెస్టెంట్. ఫ్యాన్ ఫాలోయింగ్ గట్టిగానే ఉంది. సో మనోడు సేఫ్. చంటి, ఫైమా కూడా ఎంటర్ టైన్ మెంట్ ఇస్తారు. కాబట్టి వీళ్లు కూడా షో నుంచి బయటకెళ్లే ఛాన్స్ లేదు. శ్రీసత్య కూడా బబ్లీగా కాస్త ఎంటర్ టైన్ మెంట్ ఇస్తుంది. ఇక మిగిలిన ముగ్గురిలో ఆరోహి, ఇనయా, అభినయ మధ్య గట్టి పోటీ నెలకొంది.
ఇందులో ఆరోహి, ఇనయా.. గొడవ పడుతూనో మరో విధంగానే బిగ్ బాస్ కెమెరా కంటికి చిక్కుతున్నారు. దీంతో వీరికి ఓట్లు కాస్త పడుతున్నట్లు తెలుస్తోంది. ఇక చివరగా మిగిలింది అభినయ శ్రీ. అప్పుడెప్పుడో ‘ఆర్య’లో అమలాపురం సాంగ్ చేసి ఫేమస్ అయింది. ఆ తర్వాత కొన్నాళ్లకు పూర్తిగా స్క్రీన్ కి దూరమైంది. ఇప్పుడు బిగ్ బాస్ లోకి అడుగుపెట్టింది. ఎలిమినేషన్స్ లో నిలవడం, దానికి తోడు మూడు రోజులే ఓటింగ్ సదుపాయం ఉండటంతో ఈమెనే ఎలిమినేట్ అయినట్లు తెలుస్తోంది. అసలు విషయం ఏంటనేది మాత్రం ఆదివారానికి క్లారిటీ వచ్చేస్తుంది.
ఇదీ చదవండి: బిగ్ బాస్ షోపై సన్నీ కామెంట్స్.. విన్నర్ కావడం వల్ల ఏం మారలేదంటూ..!