బిగ్ బాస్ కొత్త సీజన్ లో కొత్త కంటెస్టెంట్స్ కి ఫస్ట్ టాస్క్ ఇచ్చేశాడు. అప్పుడే వాళ్ల మధ్య ఫిట్టింగ్ పెట్టేశాడు. అందరూ కూడా ఆ ప్లేస్ కోసం కొట్టుకునేలా చేసే పక్కా స్కెచ్ వేశాడు. దీంతో గొడవలు జరగడం ఖాయమని తెలుస్తోంది. ఎందుకంటే టాస్క్ అలా ఉంది మరి. ఆదివారం చాలా గ్రాండ్ గా బిగ్ బాస్ ఆరో సీజన్ ప్రారంభమైంది. 21 మంది కంటెస్టెంట్స్.. సరికొత్తగా డిజైన్ చేసిన హౌస్ లో అడుగుపెట్టారు. బిగ్ బాస్.. పార్టిసిపెంట్స్ అందరికీ ఫస్ట్ టాస్క్ కూడా ఇచ్చేశాడు. ఫైమా దాని గురించి చదివి అందరికీ వివరించింది
ఇక వివరాల్లోకి వెళ్తే.. . ఆ టాస్క్ ఏంటంటే క్లాస్, మాస్, ట్రాష్ అని మూడు గ్రూపులు. అందులో క్లాస్ లో ఉండేవాళ్లు సకల సౌకర్యాలు అనుభవించేవాళ్లు. వీళ్లు ఏ పని చేయాల్సిన అవసరం లేదు. మిగతా రెండు గ్రూపుల వాళ్లతో పని చేయించుకోవచ్చు. వీఐపీ బాల్కానీ వీరికి డైరెక్ట్ యాక్సిస్ సదుపాయం ఉంది. అలానే వీళ్లు.. డైరెక్ట్ గా కెప్టెన్సీ పోటీదారులు అవుతారు. వీరికి లభించే పెద్ద ప్రయోజనం.. మొదటి వారం నామినేషన్స్ నుంచి సేవ్ అవుతారు. అంటే వారిని ఎలిమినేట్ చేయడం కుదరదు.
ఇక ట్రాష్ విషయానికొస్తే.. వీళ్లకు ఎలాంటి ప్రయోజనాలు లభించవు. ఇంటి పనులన్నీ చేయాల్సి ఉంటుంది. వీటితో పాటే ఇతరుల కోరిన పనులు కూడా చేయాల్సి వస్తుంది. వీళ్లు గార్డెన్ ఏరియాలోనే నిద్రపోవడంతో పాటు అక్కడ వంట చేసుకుని తినాల్సి ఉంటుంది. వీళ్లకు కెప్టెన్సీ పోటీదారులయ్యే అవకాశం లభించదు. ఇక వీళ్లకు జరిగే అతి పెద్ద నష్టం.. ఇంటి నుంచి బయటకు వెళ్లడానికి నేరుగా నామినేట్ అయిపోతారు.
ఇక మాస్ విషయానికొస్తే.. వీళ్లు బిగ్ బాస్ హౌస్ లో సామాన్యులు. ఎలాంటి విశేషాధికారాలు లభించవు. పెద్ద నష్టాలు కూడా ఉండవు. కానీ క్లాస్ సభ్యులు చేయాల్సిన పనిని వీళ్లు చేయాల్సి ఉంటుంది. అలానే ట్రాష్ సభ్యులతో.. నచ్చిన పనులు చేయించుకోవచ్చు. మాస్ సభ్యుల నుంచి కూడా కొంతమందికి కెపెన్ అయ్యే ఛాన్సు లభిస్తుంది. ఇక ఈ మూడు గ్రూపుల్లోని ప్రతి దానిలో ముగ్గురు సభ్యులు ఉంటారు. కానీ అది ఎవరనేది మాత్రం 21 మందిలో వాళ్లలో వాళ్లే తేల్చుకోవాలి. బిగ్ బాస్ అడిగినప్పుడు ఆ పేర్లు చెప్పాలి. దీన్నిబట్టి చూస్తుంటే.. దారుణంగా ఉన్న ఫస్ట్ టాస్క్ తోనే గొడవలు ఖాయమని తెలిసిపోయింది. చూడాలి ఏం జరుగుతుందో. ఈ టాస్క్ పై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో పోస్ట్ చేయండి.
ఇది కూడా చదవండి: బిగ్ బాస్ హౌస్‌లో ఆదిరెడ్డి రివ్యూలు.. సంబంధంలేని వాటిల్లో రేవంత్ వేలు పెడుతున్నాడు..!