బిగ్ బాస్ హౌసులో మిగతా కంటెస్టెంట్స్ మాటేమో గానీ కపుల్ వస్తే ఉంటుంది. ఆ మజానే వేరు. ఎందుకంటే ఇద్దరు తెలియని వ్యక్తులు హౌసులోకి వచ్చిన తర్వాత పరిచయం కావడం, ఆ తర్వాత వాళ్ల మధ్య బాండింగ్ పెరగడం.. ఇదంతా జరగడానికి చాలా టైమ్ పడుతుంది. కానీ ఓ రియల్ కపుల్ వచ్చారనుకోండి. తర్వాత రోజు నుంచి వారి మధ్య ప్రేమ, కొట్లాట, గిల్లికజ్జాలు జరగడం పక్కా. ఇప్పుడు కూడా సేమ్ రోహిత్-మెరీనా విషయంలో అలానే జరుగుతోంది. అది ప్రేక్షకులకు కూడా తెగ ఆసక్తి కలిగిస్తోంది.
ఇక వివరాల్లోకి వెళ్తే.. బిగ్ బాస్ మూడో సీజన్ లో తొలిసారి భార్యభర్తకు ఎంట్రీ దొరికింది. వరుణ్ సందేశ్-వితిక హౌసులోకి వచ్చి తెగ సందడి చేశారు. మిగతా వాళ్లకంటే వాళ్లిద్దరే తరుచూ గొడవపడేవారు. అలా ఆ సీజన్ ఎంటర్ టైనింగ్ గా సాగింది. క్లీన్ ఇమేజ్ తోనే వరుణ్-వితిక బయటకొచ్చారు. ఇక మూడు సీజన్స్ తర్వాత ఆ కోటాలో సీరియల్ యాక్టర్స్ మెరీనా-రోహిత్ ని హౌసులోకి తీసుకొచ్చారు. వచ్చిన రెండో రోజే ఈ జంట గలాటా మొదలుపెట్టేసింది. వాష్ రూమ్ ఏరియాలో ఉన్న టైమ్ లో మెరీనా, గీతూ గురించి ఏదో చెప్పబోయింది. ఆ సమయంలో అద్దంలో రోహిత్ బాడీ చూసుకుంటున్నాడు. అది మెరీనాకు నచ్చలేదు. ముందు బాడీ అయినా చూసుకో లేదంటే చెప్పేదైనా సరే విను అని విసుక్కుంది.
రోహిత్ చెప్పు అని అన్నాడు గానీ అప్పటికీ కోపం తెచ్చుకున్న మెరీనా.. నేను చెప్పనంటూ వెళ్లిపోయింది. దీనికి కౌంటర్ గా… ఓవర్ యాక్షన్ చేయకు అని మెరీనాపై రోహిత్ విసుక్కున్నాడు. అంతకు కాసేపు ముందే హగ్గు కోసం ప్రేమగా గిల్లికజ్జాలు ఆడుతున్న మెరీనా-రోహిత్.. ఇప్పుడు సీరియస్ గా గొడవపడేసరికి నెటిజన్స్ షాకయ్యారు. హౌసులోకి వచ్చిన రెండో రోజే ఇలా అవుతున్నారంటే.. రానున్న రోజుల్లో ఈ జంట జర్నీ ఎలా సాగుతుందోనని నెటిజన్స్ తెగ చర్చించుకుంటున్నారు. మరి మెరీనా-రోహిత్ గిల్లికజ్జాల గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో పోస్ట్ చేయండి.
ఇదీ చదవండి: బిగ్ బాస్ లోకి వచ్చాక నా భర్త మారిపోయాడు! హగ్ కోసం మెరీనా రచ్చ!