బిగ్ బాస్ సీజన్ 6 గత ఆదివారం గ్రాండ్ గా ప్రారంభమైన సంగతి తెలిసిందే. హోస్ట్ నాగార్జున కంటెస్టెంట్లను ఒక్కొక్కరిగా ప్రేక్షకులకు పరిచయం చేశారు. చలాకీ చంటి, సింగర్ రేవంత్, నటుడు బాల ఆదిత్య, సీరియల్ నటి కీర్తి భట్, నువ్వు నాకు నచ్చావ్ ఫేమ్ పింకీ, నటి అభినయశ్రీ, ఆర్జే సూర్య, ఆరోహి రావు.. వంటి సెలెబ్రిటీలతో కూడిన 21 మంది కంటెస్టెంట్స్ హౌస్ లోకి వెళ్లారు. ఇక్కడివరకు బాగానే ఉన్నా.. ఇక్కడే, అసలు సమస్య మొదలవుతోంది. బిగ్ బాస్ కంటెస్టెంట్లను గుర్తుపట్టలేక జనాలు గగ్గోలు పెడుతున్నారు. ఎందుకలా జరుగుతుందో చూద్దాం..
హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చే ముందు స్టేజ్ పై.. కనువిందు చేసిన కంటెస్టెంట్లు లోపలకి వెళ్ళాక మేకప్ లేకుండా తిరుగుతున్నారు. బుల్లితెరపై, వెండితెరపై మేకప్ లో అందంగా కనిపించిన ఈ సెలెబ్రిటీలను మేకప్ లేకుండా చూసి జనాలు అవాక్కవుతున్నారు. సోషల్ మీడియాలో దీనిపై విపరీతమైన చర్చ మొదలుపెట్టారు. ముఖ్యంగా సీరియల్ నటి కీర్తి భట్, ఆరోహి రావు, గీతూ రాయల్, నేహా చౌదరి లుక్స్ పై విపరీతమైన జోక్స్ పేలుస్తున్నారు. ‘ఓ బిగ్ బాస్ గారూ.. వాళ్లకు మేకప్ వేపించయ్యా..! గుర్తుపట్టలేకపోతున్నాం’ అంటూ కొందరు, ‘టీఆర్పీ రేటింగ్స్ పడిపోకుండా ఉండాలంటే.. వాళ్ల అసలు రూపాలు వద్దు’ అంటూ మరికొందరు మీమ్స్ క్రియేట్ చేసి పోస్ట్స్ చేస్తున్నారు.
ఇక, మూడు ఎపిసోడ్స్ తరువాత నామినేషన్స్ ప్రక్రియ కూడా మొదలైంది. ఇంటి సభ్యులతో క్లాస్-మాస్-ట్రాష్ టాస్క్ ఆడించిన బిగ్ బాస్, టాస్క్ లో ప్రతిభ ఆధారంగా ముగ్గురిని సేవ్ చేసి మరో ముగ్గురిని ఎలిమినేషన్ కు నామినేట్ చేశాడు. గీతూ రాయల్, ఆది రెడ్డి, నేహా చౌదరి సేవ్ కాగా, బాల ఆదిత్య, ఇనయా సుల్తానా, అభినయశ్రీ ఎలిమినేషన్ కి నామినేట్ అయ్యారు. నేటి ఎపిసోడ్ లో మరికొందరు ఎలిమినేషన్ కి నామినేట్ కానున్నారు. మొత్తానికి మొదటివారం హౌస్ ని వీడే కంటెస్టెంట్ ఎవరనే ఉత్కంఠ కొనసాగుతుంది. బాస్ కంటెస్టెంట్లకు మేకప్ వేయమనడం సరైన నిర్ణయమా? మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.