బిగ్ బాస్ ఈసారి అస్సలు ఇంట్రెస్టింగ్ గా లేదు! ఒక్కడు కూడా సరిగా ఆడట్లేదు! ఆడినా సరే ఎంటర్ టైన్ మెంట్ ఏ మాత్రం ఇవ్వట్లేదు! ఇవి మేం ఏదో కల్పించి చెబుతున్న మాటలు కాదు.. స్వయంగా బిగ్ బాస్ షో ప్రేమికులు అనుకుంటున్న, సోషల్ మీడియాలో పెడుతున్న కామెంట్స్. ఈ సీజన్ మొదలై ఇప్పటికే 44 రోజులైపోయింది. గత సీజన్లతో పోలిస్తే.. ఈసారి అత్యంత దారుణైన రేటింగ్స్ వస్తున్నాయి. షోని ఒక్కరంటే ఒక్కరు కూడా పట్టించుకోవడం లేదు. గత కొన్నాళ్ల నుంచి సోషల్ మీడియా మొత్తం ఇదే టాక్. ఇప్పుడు బిగ్ బాస్ కి కూడా ఈ విషయం అర్ధమైపోయినట్లుంది. దీంతో హౌస్ మేట్స్ అందరినీ నిలబెట్టి మరీ కడిగేశాడు.
ఇక వివరాల్లోకి వెళ్తే.. బిగ్ బాస్ ఆరో సీజన్ ఏ మాత్రం ఆసక్తిగా ఉండట్లేదు. గీతూ, రేవంత్, శ్రీహాన్ లాంటి కొందరు తప్పించి మిగతా హౌస్ మేట్స్ అందరూ కూడా ఏదో హౌసులో ఉన్నామా, తిన్నామా, పడుకున్నామా అన్నట్లు బిహేవ్ చేస్తున్నారు. హోస్ నాగార్జున కూడా ఇదే విషయమై హెచ్చరించాడు. అయినా సరే హౌస్ మేట్స్ ప్రవర్తనలో మార్పు రాలేదు. దీంతో ప్రేక్షకులు ఈ షోని లైట్ తీసుకుంటున్నారు! అందుకు నిదర్శనమే ప్రతిరోజూ వస్తున్న రేటింగ్స్. దీంతో బిగ్ బాస్ కి చిర్రెత్తుకొచ్చింది. ‘మీ అందరికీ ఫుడ్, బెడ్ వేస్ట్.. బయటకెళ్లిపోండి’ అని డైరెక్ట్ గానే గేట్లు ఓపెన్ చేసేశాడు. బిగ్ బాస్ షో చరిత్రలోనే ఇలా చేయడం ఇదే ఫస్ట్ టైమ్.
మంగళవారం రిలీజ్ చేసిన ప్రోమోలో మొత్తం ఈ విషయమే బిగ్ బాస్ ప్రస్తవించాడు. ‘ఇంటిసభ్యుల నిర్లక్ష్యం, టాస్కుల పట్ల నిర్లక్ష్యం, బిగ్ బాస్ ఆదేశాల పట్ల నిర్లక్ష్యం, మీ నిర్లక్ష్యం ప్రేక్షకులనే కాదు బిగ్ బాస్ ని కూడా నిరాశపరిచింది. బిగ్ బాస్ చరిత్రలో ఎన్నడూ లేనంతగా నిరాశపరుస్తున్న కారణంగా ఈ వారం కెప్టెన్సీ పోటీదారుల టాస్క్ రద్దు చేస్తున్నాం. ప్రేక్షకుల పట్ల, ఈ షో పట్ల గౌరవం లేదని మీరు నమ్మినట్లయితే తక్షణమే ముఖద్వారం నుంచి బిగ్ బాస్ ఇంటిని వదిలి బయటకెళ్లిపోవచ్చు’ అని బిగ్ బాస్ సీరియస్ వార్నింగ్ ఇచ్చాడు. దీంతో హౌస్ మేట్స్ కాస్త సారీలు చెబుతూ బిగ్ బాస్ ని బుజ్జగించే ప్రయత్నం చేశారు. కానీ అదంతా జరిగినట్లు కనిపించడం లేదు. ఇదంతా చూస్తుంటే ఈసారి బిగ్ బాస్ మధ్యలోనే ఆపేసినా సరే ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు. చూడాలి ఏం జరుగుతుందో.. మరి హౌస్ మేట్స్ ని బిగ్ బాస్ తిట్టడంపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో పోస్ట్ చేయండి.