Arohi Rao: బిగ్ బాస్-6 లో ఎప్పుడు గట్టిగా వినిపిస్తున్న పేర్లలో ఆరోహి ముందు వరుసలో ఉంటుంది. హౌస్ లో ఆరోహి ఆట చూసిన వారంతా “అయ్య బాబోయ్ శివంగి రా బాబు” అంటూ నోర్లు వెళ్లబెడుతున్నారు. అయితే.. ఆరోహి ఇంత మొండిగా, దృఢంగా మారడం వెనుక చాలానే కష్టాలు ఉన్నాయి. ఆమె గతం అంతా కష్టాల మయం. ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్ లో ఆరోహి బాగా పాపులర్ అవ్వడంతో ఆమె గతం తాలూకు విషయాలు ఒక్కొక్కటిగా వైరల్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే బాల్యంలో ఆరోహి ఎదుర్కొన్న లైంగిక వేధింపులు కూడా బయటకి వచ్చాయి. ఆరోహిది తెలంగాణలోని పరకాలలో ఉన్న కనపర్తి అనే మారుమూల గ్రామం. చిన్నతనంలోనే ఆమె తల్లి చనిపోయింది. తండ్రి వేరే పెళ్లి చేసుకున్నాడు. దీంతో ఆరోహీ అమ్మమ్మ దగ్గరే పెరిగింది.
ఎంబీఏ వరకూ చదివి, తరువాత హైదరాబాద్ వచ్చి ఆరోహి రావుగా పేరు సంపాదించుకుంది. అయితే.. ఈ గ్యాప్ లో ఆరోహి చాలా బాధలను భరించింది. ఆ విషయాలను ఆరోహీనే స్వయంగా బయట పెట్టింది. ‘‘ నేను అమ్మమ్మ దగ్గరే ఒంటరిగా పెరిగాను. ఓ అన్నయ్య ఉన్నా అతను హాస్టల్ లోనే ఉండిపోవడంతో నాకు మంచి, చెడు చెప్పే వాళ్ళు లేకపోయారు. మా బంధువుల అతను ఉండేవాడు. అతను నాకు వరుసకి బాబాయ్ అవుతాడు. కానీ.., నేను అతన్ని అన్నా అనే పిలిచేదాన్ని. చిన్నతనంలో అతను నా పై చేతులు వేస్తుంటే.. నన్ను ఎందుకు కొడుతున్నావు? నలుపుతున్నావు? అని మాత్రమే అడిగేదాన్ని.
కానీ.., అప్పుడు నాపై అఘాయిత్యం జరిగిన విషయాన్ని గుర్తించలేకపోయాను. ఒక వయసు వచ్చాక.. ఇక మగాళ్లు అందరిని దూరం పెట్టడం, అందరిని అనుమానించడం అలవాటు చేసుకున్నాను. కానీ.., కొన్నాళ్ల తరువాత అందరూ అలానే ఉండరు అని అర్ధం చేసుకున్నాను. కానీ.., నా చిన్నతనంలో జరిగిన ఆ ఘటన నన్ను ఓ బండరాయిగా మార్చేసింది. అక్కడ నుండి లైఫ్ ఎలాంటి కష్టం వచ్చినా ఫేస్ చేయడం అలవాటు చేసుకున్నాను’’ అంటూ.. ఆరోహి తన గతాన్ని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మరి.. ఆరోహి విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
ఇవి కూడా చదవండి : Geetu Royal: పాపం గీతూ రాయల్.. తొలివారం వరస్ట్ పర్ఫార్మర్‌గా..!