బిగ్ బాస్ 6 స్టార్ట్ కావడం మాటేమో గానీ.. కంటెస్టెంట్స్ గురించి ఆసక్తికర విషయాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. ఈసారి హౌసులోకి 21 మంది కంటెస్టెంట్స్ ఎంటర్ కాగా, అందులో 11 మంది అమ్మాయిలు, 10 మంది అబ్బాయిలు. వీళ్లందరూ కూడా హౌసులో నెమ్మది నెమ్మదిగా తమ గురించి ఓపెన్ అవుతున్నారు. మిగతా వాళ్లతో మాట్లాడుతూ, తమ లైఫ్ లోని మధుర జ్ఞాపకాల్ని గుర్తుచేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఆరోహి రావ్.. తన క్యూట్ లవ్ స్టోరీ గురించి చెప్పేసింది. అప్పట్లో తను ఎంత అమాయకంగా ఉండేదాన్నో రివీల్ చేసింది.
ఇక వివరాల్లోకి వెళ్తే.. ఇస్మార్ట్ అంజలిగా టీవీ ఆడియెన్స్ కి పరిచయమున్న ఆరోహిది ఒడిదుడుకుల జీవితం. తల్లి అనారోగ్యంతో చనిపోతే తండ్రి పట్టించుకోకుండా వేరే పెళ్లిచేసుకుని వెళ్లిపోయాడు. కష్టపడి చదువు పూర్తిచేసిన ఈమె.. కెరీర్ కోసం హైదరాబాద్ వచ్చింది. ఆరోహిగా పేరు మార్చుకుంది. ఈ కష్టాల జీవితంలోనూ ఆరోహికి ఓ ప్రేమకథ ఉందట. ఆ విషయాన్ని ఆమెనే స్వయంగా బయటపెట్టింది. షానీ, పింకీ, నేహా చౌదరితో మాట్లాడుతున్న సమయంలో తన లవ్ స్టోరీ గురించి చెప్పింది.
‘డిగ్రీ వరకు ఈ ప్రేమ గురించి తెలియదు. ముద్దు పెడితే కడుపు వస్తుందనుకునేంత అమాయకత్వం. అలాంటి నాకు ఎంబీఏ చదివేరోజుల్లో ఓ అబ్బాయి నచ్చాడు. మంచి హైట్, హ్యాండ్సమ్ గా ఉండేవాడు. కాలేజీకి అప్పుడప్పుడు వచ్చేవాడు. కానీ సార్స్ అడిగిన ప్రశ్నలకు మాత్రం టక్కున సమాధానం చెప్పేసేవాడు. పాలిటిక్స్ లో తిరుగుతూ, బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ ఆర్గనైజ్ చేసేవాడు. అలా తనతో పరిచయం. ఓరోజు బ్లాక్ షర్ట్ వేసుకొచ్చాడు. అప్పుడు అలా చూస్తుండిపోయా’
‘ఇది ప్రేమ, ఆకర్షణ తెలియడం కోసం నాకు నేనే టెస్ట్ పెట్టుకున్నారు. నెలరోజులు తిరిగేసరికల్లా బోర్ కొట్టేశాడు. మెల్లగా దూరమవడం మొదలుపెట్టాడు. ఎంత దూరం అవుదామనుకుంటే అంత దగ్గరయ్యేవాడు. మా ప్రయాణం మొదలైన నెలరోజులకే నేను కాలేజీ మానేశాను. తను నా లైఫ్ నుంచి వెళ్లిపోయినా ఇప్పటికీ టచ్ లో ఉన్నాడు. ఇతడే కాదు మరో వ్యక్తి కూడా నా జీవితంలో ఉన్నాడు. టైటిల్ గెలిచినా గెలవకపోయినా గౌరవంగా ఆడి రా అని చెప్పి పంపించాడు’ అని ఆరోహి లవ్ గురించి బయటపెట్టింది. ఇకపోతే తొలి వారంలోనే ఆరోహి.. ఎలిమినేషన్ కోసం నామినేట్ అయింది. మరి ఆరోహి ప్రేమకథ గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో పోస్ట్ చేయండి.
ఇదీ చదవండి: Bigg Boss 6 Nominations: వారమే కాలేదు.. బిగ్ బాస్ 6లో అప్పుడే ఊహించని ట్విస్టులు!