గత సీజన్లతో పోలిస్తే.. ఈసారి బిగ్ బాస్ ఏమంత ఆసక్తిగా ఉండట్లేదు. అందుకే తొలి రెండు వారాలు రేటింగ్ దారుణంగా వచ్చింది. గణాంకాలు కూడా సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చేసింది. దీనికి తోడు హోస్ట్ నాగార్జున కూడా హౌస్ మేట్స్ ఒక్కొక్కరిని నిలబెట్టి మరీ ఆడేసుకున్నాడు. ఇన్ డైరెక్ట్ గా గొడవలు పడమని ఆర్డర్స్ కూడా ఇచ్చాడు. దీంతో రాబోయే వారాలన్నీ రచ్చ రచ్చగా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. తాజాగా రిలీజ్ చేసిన మూడో వారం నామినేషన్స్ ప్రోమో దానికి తగ్గట్లే ఉంది.
ఇక వివరాల్లోకి వెళ్తే.. బిగ్ బాస్ 6వ సీజన్ మూడో వారంలోకి అడుగుపెట్టేసింది. దీంతో మళ్లీ నామినేషన్స్ మొదలయ్యాయి. ఒకరిని మరొకరు నామినేట్ చేస్తూ, వాళ్లిద్దరి మధ్య వాదప్రతివాదనలు.. దీంతో హౌస్ మొత్తం హీటెక్కింది. శ్రీసత్య-ఇనయా, చంటి-గీతూ, గీతూ-సుదీప, ఇనయా-గీతూ ఒకరిపై ఒకరు అరుస్తూ నామినేషన్స్ లో రచ్చ రచ్చ చేశారు. ఇక ఆదిరెడ్డి అయితే ఏకంగా బిగ్ బాస్ నే బెదిరిస్తూ గట్టిగా మాట్లాడాడు. పళ్లెం ఎత్తేస్తానని ఏకంగా బెదిరిస్తూ కనిపించాడు.
ఈ వారం నామినేషన్స్ లో ఇనయాని తొలుత రంగు పూసి నామినేట్ చేశాడు. దీనికి కోపంగా రెస్పాండ్ అయిన ఆమె.. మీరు చాలా గేమ్ తెలుసుకుని వచ్చారు కాబట్టి.. అని అంటుండగానే ఆదిరెడ్డి ఫైర్ అయిపోయడు. అలా అనడం రాంగ్, బిగ్ బాస్ ఓపెన్ బుక్… గేమ్ తెలుసుకుని రాకపోవడం మీ తప్పు అని ఇనయాతో అన్నాడు. ఈ క్రమంలోనే ఇద్దరి మధ్య వాగ్వాదం, దీంతో కంట్రోల్ చేసుకోలేకపోయిన ఆదిరెడ్డి.. ‘బిగ్ బాస్ పళ్లెం ఎత్తేస్తా’ అని బెదిరించాడు. ప్రోమోలో ఈ సీన్ కాస్త యమ ఇంట్రెస్టింగ్ గా ఉంది.
ఇకపోతే బిగ్ బాస్ ని నేరుగా బెదిరించడం, ఆయన చెప్పిన మాట వినకపోవడం ఇదేం కొత్తకాదు. తొలి సీజన్ లో శివబాలాజీ దగ్గర నుంచి ప్రస్తుత సీజన్ లో బిగ్ బాస్ పైనే ఏకంగా సీరియస్ అయిన ఆదిరెడ్డి వరకు చాలాపెద్ద లిస్ట్ ఉంది. ఈ సీజన్ లోనే ఆడుతున్న శ్రీసత్య కూడా.. ఇక్కడ ఎంతమంది గేమ్ ఆడారు? కొత్తగా చెప్పేదేముంది సిల్లీ నామినేషన్స్ అని రెక్లెస్ గా మాట్లాడింది. ఇవన్నీ చూస్తుంటే.. రాబోయే కొన్ని వారాలు కూడా రంజురంజుగా ఉండబోతుందని తెలుస్తోంది. మరి ఆదిరెడ్డి-ఇనయా గొడవపై, బిగ్ బాస్ పై సీరియస్ కావడం గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో పోస్ట్ చేయండి.
ఇదీ చదవండి: ఈవారం బిగ్ బాస్ నామినేషన్స్ లో రచ్చ.. ఏకంగా 9 మంది..!