బిగ్ బాస్.. తెలుగు బుల్లితెర ప్రేక్షకులకి ఎంతో ఇష్టమైన షో. తెలుగులో ఇప్పటికే 5 సీజన్స్ పూర్తి చేసుకున్న బిగ్ బాస్.. తాజాగా ఆరో సీజన్ తో ప్రేక్షకుల ముందుకి వచ్చింది. బిగ్ బాస్-6 మొదలై వారమే అవుతున్నా ఎంటర్టైన్మెంట్ కి మాత్రం కొదవలేదు. గీతూ, ఇనాయ, రేవంత్, ఆరోహి వంటి స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ తొలిరోజు నుండి ఓ రేంజ్ లో గేమ్ ఆడుతూ ఉండటం.. బిగ్ బాస్-6 లో గొడవలు బాగానే జరుగుతున్నాయి. అయితే.., ఈ సీజన్ ఫేవరేట్ కంటెస్టెంట్ గా భావించిన సింగర్ రేవంత్ తీరే అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తోంది.
ఈ క్రమంలోనే బయట ఎంతో మెచ్యూర్ గా కనిపించే రేవంత్.. తొలివారం బిగ్ బాస్ హౌస్ లో పూర్తిగా తేలిపోయాడు. హౌస్ లో మిగతా సభ్యులతో అడ్జెస్ట్ కాలేక, వారితో గొడవలు పడటం, హౌస్ లో బూతులు మాట్లాడటం చిన్న పిల్లాడిలా కన్నీరు పెట్టుకోవడం వంటి అంశాలు రేవంత్ గ్రాఫ్ ని అమాంతం తగ్గించేశాయి. ఇక తాజాగా వీకెండ్ సందర్భంగా హోస్ట్ గా నాగార్జున ఎంట్రీ ఇచ్చిన ప్రోమోని రిలీజ్ చేశారు నిర్వాహకులు. ఇక తనదైన స్టయిల్ లో ఎంట్రీ ఇచ్చిన నాగ్.. వచ్చీ రాగానే గీతూపై పంచ్ లు వేసి అందరిని నవ్వించేశాడు.
సరదాగా సాగిపోయిన ఈ ప్రోమోలో నాగ్ ఎక్కడైనా సీరియస్ అయ్యాడు అంటే.. అది ఒక్క రేవంత్ విషయంలోనే. ఇంట్లో బూతులు మాట్లాడుతున్నావు అంటూ రేవంత్ కి క్లాస్ పీకడం మొదలు పెట్టారు నాగార్జున. అంతేకాకుండా టాస్క్ ఓడిపోయి బాధలో ఉన్న ఆరోహితో అంత హార్స్ గా ప్రవర్తించడం అవసరమా అంటూ కడిగి పడేశాడు నాగ్. దీంతో.. రేవంత్ బిక్కమొహం వేసుకుని అలా చూస్తూనే ఉండిపోయాడు. అయితే.. ప్రోమో చివరిలో మాత్రం నాగ్.. ఆదిరెడ్డికి ఇచ్చిన వార్నింగ్ హైలెట్ అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఏదేమైనా.. ప్రోమో చూసిన వారంతా నాగ్ హోస్ట్ గా సూపర్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. నాగార్జున ఈ రేంజ్ లో రేవంత్ కి క్లాస్ పీకడం కరెక్ట్ అని మీరు భావిస్తున్నారా? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.