బుల్లితెర ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూసిన ‘బిగ్ బాస్ 6’ రియాలిటీ షో చాలా గ్రాండ్ గా మొదలైన సంగతి తెలిసిందే. కింగ్ నాగార్జున హోస్ట్ చేస్తున్న ఈ షోలో దాదాపు 20 మంది సభ్యులు హౌస్ లో అడుగుపెట్టారు. ఇక డిఫరెంట్ టాస్కులు, ఎంటర్టైన్ మెంట్ కి అడ్డా ఫిక్స్ అనే ట్యాగ్ లైన్స్ తో వచ్చిన బిగ్ బాస్ సీజన్ 6.. మొదటి వారం నామినేషన్స్ జరిగిపోయాయి. ఈ నామినేషన్స్ సంబంధించి ప్రోమో కూడా రిలీజ్ చేశారు నిర్వాహకులు. అయితే.. ఫస్ట్ వీక్ నామినేషన్స్ జరిపిన విధానం వెరైటీగా ఉందని చెప్పాలి. తమకు ఇష్టం లేనివారి పేర్లను పేపర్ పై ప్రింట్ చేసి, ఆ పేపర్ ని టాయిలెట్ సీట్ లో వేసి ఫ్లష్ చేయాలని తెలిపారు బిగ్ బాస్. దీంతో ఈ నామినేషన్ టాస్క్ లో హౌస్ మేట్స్ మధ్య వార్ నడిచింది.
ముఖ్యంగా సింగర్ రేవంత్, జబర్దస్త్ ఫైమా మధ్య జరిగిన మాటల యుద్ధం చర్చలకు దారితీసింది. మరి వారిద్దరి మధ్య ఏం జరిగిందని అంటే.. ఫైమా వర్క్ చేయడం నేను చూడలేదని అని సింగర్ రేవంత్ అనగానే.. నువ్వే చూడలేదేమో అని కౌంటర్ వేసేసింది ఫైమా. దీంతో నేనే ఇంట్లో లేనేమోలే అని రేవంత్ అనగానే.. హౌస్ లో ఆటగాళ్లు ఉంటారు.. రేవంత్ మంచి మాటకారి అని మరోసారి ఫైమా అంది. అలాగే చివరలో వెటకారం తగ్గించుకో అని ఫైమాతో అన్నాడు రేవంత్. ముందు మీరు తగ్గించుకుంటే నేను తగ్గించుకుంటా అంటూ రివర్స్ కౌంటర్ వేసింది ఫైమా. ఇలా మొదటి వారం నామినేషన్స్ లో హైలైట్ పాయింట్ గా నిలిచారు రేవంత్, ఫైమా. ఆ తర్వాత నామినేషన్స్ లో వాసంతి కృష్ణన్.. శ్రీ సత్యని నామినేట్ చేస్తూ యాటిట్యూడ్ చూపిస్తుందని తెలిపింది. అర్జున్ కళ్యాణ్ ఫైమాను పనిచేయడం లేదంటూ నామినేట్ చేశాడు.
అనంతరం.. ఫైమా, పింకీ, వాసంతి, కీర్తి, ఆరోహి కలిసి సింగర్ రేవంత్ ని నామినేట్ చేశారు. ఈ నేపథ్యంలో ఆరోహికి, రేవంత్ కి మధ్య డైలాగ్ వార్ సాగింది. ఆమ్మో వీడు లేచాడంటూ తనను కామెంట్ చేసిందని సింగర్ రేవంత్ ఆరోహిని నామినేట్ చేశాడు. ఆ వెంటనే స్పందించిన ఆరోహి.. ఇలాంటి బద్నామ్ లు చేస్తే ఊరుకోను రేవంత్.. ఆ మాట ఎవరితో అన్నానో చెప్పాలంటూ నిలదీసింది. దీంతో ఏమో గుర్తులేదని, అయినా ఇది నా నామినేషన్ వెయిట్ అనడంతో ఆరోహి మరింత రగిలిపోయింది. ఇక ఉండబట్టలేక.. ఇంతవరకు సహించి సస్తున్నాం.. నిన్ను రెండు మార్కుల ప్రశ్న అడిగితే ఇరవై మార్కుల ఆన్సర్ చెబుతారు కదా.. ఇకపై నేను కూడా 20 మార్కుల ప్రశ్నకు 2000 మార్కుల ఆన్సర్ చెప్తానంటూ కౌంటర్ వేసింది ఆరోహి. మొదటి వారం రేవంత్, ఫైమా మాటల యుద్ధంతో పాటు కొందరి దృష్టిలో రేవంత్ టార్గెట్ అయినట్లు తెలుస్తుంది. మరి ఫస్ట్ వీక్ నామినేషన్స్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.