బిగ్ బాస్ తెలుగు సీజన్ 6.. ఎంతో ఉత్కంఠగా సాగుతున్నా ప్రేక్షకులు మాత్రం చాలా లైట్ తీసుకుంటున్నట్లు కనిపిస్తోంది. ఇటీవలి కాలంలో అయితే నెగెటివిటీనే ఎక్కువ స్ప్రెడ్ అయ్యింది. అయితే నాలుగోవారంలో జరిగిన అద్భుతాలు ఏమైనా ఉన్నాయి అంటే.. కీర్తీ భట్ ఇంటికి కెప్టెన్ కావడమే. అంతేకాకుండా కామన్ మ్యాన్ ఆదిరెడ్డి ఏ విధంగా పర్ఫార్మ్ చేస్తాడు అని ఎదురుచూసిన వారికి కాస్త నిరాశే ఎదురైంది. ఎందుకంటే ఆదిరెడ్డి మరీ మనసు, నీతి, న్యాయం అని రూల్స్ ఫాలో అవ్వాలని చూశాడు కానీ, హౌస్ మేట్స్ మాత్రం గాలి తీసేశారనే చెప్పాలి. ఇంక కెప్టెన్సీ పోటీదారుల టాస్కులో మాత్రం అర్జున్ కల్యాణ్ తన కలలను తీర్చుకున్నాడు. నిజ జీవితంలో అసలు అవు జరగవు అనుకున్నవి శ్రీ సత్యకు టాస్కు రూపంలో ఇచ్చి తీర్చేకున్నాడు. ఆ విషయంలో నాగార్జున కూడా సెటైర్స్ వేశాడు.
ఇంక బిగ్ బాస్ హౌస్ నుంచి షానీ, అభినయశ్రీ, నేహా చౌదరి ఎలిమినేట్ అయ్యారు. మరి.. నాలుగోవారం ఎవరు ఎలిమినేట్ కాబోతున్నారు అని అంతా ఎదురుచూశారు. అయితే మొదట అంతా రాజ్ ఎలిమినేట్ అవుతాడని భావించారు. కానీ, అనూహ్యంగా ఆరోహీ రావ్ ఎలిమినేట్ అయ్యింది. ఈ వారం సగం నుంచి అనధికారిక ఓటింగ్స్ లెక్కల్లోనూ ఆరోహీ రావ్ బాగా వెనుకపడింది. నిజానికి హౌస్‌లోకి రాబోయే వరకు కూడా ఆరోహీ రావుకు అంత ఫ్యాన్ బేస్ లేదు. ఆమె ఒక్కతనే కాదులెండి.. ఈ సీజన్లో వచ్చిన సభ్యుల్లో చాలా మందికి ఫ్యాన్ బేస్ లేదనే చెప్పాలి. అయితే ఆట పరంగానూ ఆరోహీ అంత గొప్పగా పర్ఫామ్ చేయలేదని చెబుతున్నారు. కొందరైతే ఆమె ఆట చూస్తుంటే చిరాకుగా ఉందని కూడా కామెంట్స్ చేశారు. తనకి నచ్చకపోతే ఎదుటివారిని చాలా చులకనగా మాట్లాడుతుందని విమర్శిస్తున్నారు.
అంతేకాకుండా సూర్యా- ఆరోహీల మధ్య ఏముంది? అనేది కూడా సోషల్ మీడియాలో బాగా ప్రచారం జరిగింది. వారి ప్రవర్తన చూస్తే వారి మధ్య ప్రేమ ఉందనే భావన కలిగేలా ఉంది. కానీ, వాళ్లు మాత్రం నేరుగా అడిగినా మా మధ్య ఉన్నది ఇదే అని చెప్పింది లేదు. తాజాగా వచ్చిన ప్రోమోలో మాత్రం వాళ్లు ఫ్రెండ్స్ మాత్రమే.. వాళ్లిద్దరికీ బయట మరో ఇద్దరు ఉన్నారనే విషయంపై క్లారిటీ ఇచ్చారు. సూర్యకు బెస్ట్ ఫ్రెండ్ కన్నా ఎక్కువైన బుజ్జమ్మ అనే అమ్మాయి ఉందని, ఆరోహీ రావుకు నందు అనే లవర్ ఉన్నాడని క్లారిటీ ఇచ్చారు. మరి.. లోపల వీళ్లిద్దరు ఇన్నాళ్లు చేసింది ఏంటనే ప్రశ్నలు కూడా వేస్తున్నారు. ఏదేమైనా మొదటి నుంచి వీళ్లిద్దరు మంచి ఫ్రెండ్స్ అని కాస్త పద్ధతిగా ఉండి ఉంటే అలాగైనా కాస్త మంచి ఓట్స్ పడేవనే భావన కూడా లేకపోలేదు. మొత్తానికి నాలుగో వారం ఎలిమినేషన్ లో కాస్త షాకిచ్చారనే చెప్పుకోవచ్చు.