బిగ్ బాస్ తెలుగు సీజన్ 6ని గాడిలో పెట్టడానికి చాలా కష్టపడుతున్నారు. ఇంట్లో గొడవలు, కొట్లాటలు తగ్గడంతో రేటింగ్స్ పడిపోయాయని భావించినట్లుగా ఉన్నారు. ఇంట్లోని సభ్యులు కొట్లాడుకోవాలంటూ ఇన్‌డైరెక్ట్ గా సిగ్నల్స్ ఇస్తున్నారు. అందరూ ఫైర్ అవ్వాలని చెప్పకనే చెబుతున్నారు. వీకెండ్ ఎపిసోడ్ ప్రభావం ఇంట్లోని సభ్యులపై పడినట్లు స్పష్టంగా తెలుస్తోంది. అందరూ అంత క్లోజ్‌గా కనిపించడం లేదు. అయితే బిగ్ బాస్ హౌస్‌లో గొడవలు మాత్రమే కాదు.. లవ్ ట్రాక్‌లు కూడా ఉంటాయి, ఉండాలి కూడా. ఈ సీజన్లోనూ రెండు జంటలు తయారయ్యేలా ఉన్నారు. ఒకరు అర్జున్ కల్యాణ్- శ్రీ సత్య కాగా.. రెండో జంట ఆరోహీ రావ్- ఆర్జే సూర్యా అంటూ ప్రేక్షకులు ఫిక్స్ అయిపోయారు. నాగార్జున మాట్లాడుతున్న సమయంలో వారిమధ్య ఏదో ఉందని కేకలు కూడా వేశారు.
ప్రత్యేకంగా ఆరోహీ రావ్ విషయానికి వస్తే.. ఆమె ఆటతీరు చాలా మెరుగైందనే చెప్పాలి. హౌస్‌లో ఆమె మొదటి రోజు నుంచీ యాక్టివ్‌గా అగ్రెసివ్‌గానే కనిపిస్తోంది. ప్రతి విషయంలో ఆమె వాయిస్ వినిపిస్తూ ఉంటుంది. ఆర్జే సూర్యకు కూడా చాలా క్లోజ్ గా ఉంటూ ఉంటుంది. వాళ్లిద్దరూ 3 సంవత్సరాలుగా ఫ్రెండ్స్ కావడంతో.. బిగ్ బాస్ హౌస్‌లో ఎక్కువగా కలిసే కనిపిస్తుంటారు. రేవంత్ తో గొడవ జరిగినప్పటి నుంచి ఆరోహీ రావ్ బాగా హైలెట్ అయ్యింది. మొదట ఆమె మీద ఎలాంటి అంచనాలు లేవు. కానీ, రేవంత్ తో ఆమె కొట్లాడిన తీరు చూసి అంతా ఫిదా అయిపోయారు. అప్పటి నుంచి ఆమెపై దృష్టి పెట్టారు.
రెండోవారంలోనూ ఆరోహీ రావ్ మార్క్ చూపించింది. తన శక్తిమేర టాస్కుల్లో పోరాడింది. తాజాగా కెప్టెన్ రాజ్‌తోనూ గొడవకు దిగింది. నిద్రపోయిన విషయంలో పనిష్మెంట్ ఇస్తాననగానే ఆమె వాదించింది. అందరూ పడుకున్నారు. కానీ, నువ్వు నా ఒక్కదానికే పనిష్మెంట్ ఇస్తానంటున్నావ్ అంటూ వాదించింది. అలా అయితే నువ్వు ఇచ్చినా నేను చేయను అంటూ తెగేసి చెప్పింది. అయితే ఆమె స్వభావం అలాగే ఉంటుందని మరోసారి నిరూపించుకుంది. కూరగాయలు కోసే సమయంలో అందరితో మాట్లాడుతూ.. ఆరోహి కొన్ని వ్యాఖ్యలు చేసింది. తన తప్పు ఉంటే తలదించుకుంటానేమో గానీ, తప్పు చేయకుండా మాటలు అంటే మాత్రం ఊరుకోనంటూ క్లారిటీ ఇచ్చింది. తప్పులేకుండా తనని అంటే నాగార్జున గారైనా ఊరుకోను అంటూ ఆరోహీ రావ్ కామెంట్ చేసింది. ఆరోహీ రావ్ వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.