బిగ్ బాస్ తెలుగు సీజన్ 6.. షో మొత్తం మొదటి వారంలోనే ఎంతో ఉత్కంఠను రేకిస్తూ వస్తోంది. గొడవలు, చర్చలకు, కేకలకైతే అస్సలు ఢోకా లేదు. హౌస్‌లో ఇప్పటికే గ్రూపులుగా ఏర్పడటం చూశాం. అంటే బిగ్ బాస్ టాస్కుల కోసం చేసే గ్రూపులు కాకుండా వీళ్లంతటికి వీళ్లు కూడా వారికి నచ్చిన వారితో మాట్లాడుకుంటూ గ్రూపులుగా విడిపోవడం చూస్తూనే ఉన్నాం. బిగ్ బాస్ హౌస్‌లో ఉన్న వారిలో ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి.. అందరికీ టఫ్ ఫైట్ ఇస్తున్న వారిలో ఆరోహీ రావు ఒకరు. ఆమె ఇంట్లోని సభ్యులకు టాస్కులు కానీ, మాటలు కానీ, పనులు కానీ.. ఏదైనా 100 శాతం పోటీ ఇస్తోంది. అందరితో శభాష్ అని కూడా అనిపించుకుంటోంది.
తాజాగా బిగ్ బాస్ హౌస్‌లో ఆరోహీ రావ్ బర్త్‌డే సెలబ్రేట్ చేశారు. నిజానికి ఆరోహీ ఎవరికీ తన బర్త్ డేఅని చెప్పుకోలేదు. కానీ, అర్ధరాత్రి 12 గంటలకు ఒక్కసారిగా ఆకాశంలోకి జువ్వలు లేచాయి. క్రాకర్స్ శబ్ధాలు విని అందరూ పరుగున లాన్‌లోకి వచ్చారు. అయితే మొదట అంతా వినాయకుడి ఊరేగింపు కోలాహలం అనుకున్నారు. కానీ, అవి ఆరోహీ రావు బర్త్ డే సెలబ్రేషన్స్ అని తర్వాత తెలిసింది. బయటి నుంచి వాళ్లు హ్యాపీ బర్త్ డే ఆరోహీ అంటూ కేకలు వేయగా.. ఇంట్లో ఉన్న సభ్యులు సైతం థాంక్యూ అంటూ రిప్లై ఇచ్చారు. అందరూ ఆరోహీకి జన్మదిన శుభాకాంక్షలు చెప్పారు. ఈ సెలబ్రేషన్స్ తో ఇంట్లోని సభ్యులు ఓ విషయాన్ని గ్రహించారు. నిజానికి బిగ్ బాస్ హౌస్ లో టైమ్ తెలియదు. వాళ్లు క్రాకర్స్ కాల్చడంతో టైమ్ 12 గంటలు అయ్యిందని తెలుసుకోగలిగారు.
సెలబ్రేషన్స్ తర్వాత కీర్తీ భట్.. ఆరోహీని గట్టిగా హగ్ చేసుకుని విష్ చేసింది. ఆ తర్వాత కూడా ఆమెను వదలకుండా అసలు ఈ సెలబ్రేషన్స్ ఎవరు చేశారు? ఏదైనా స్టోరీ ఉందా అంటూ ప్రశ్నించగా.. అందుకు ఆరోహీ రావు చెప్పిన ఆన్సర్ వైరల్ గా మారింది. ‘నాకు పెద్దగా ఫ్రెండ్స్ కూడా లేరు. నా లైఫ్ లో ఒక స్పెషల్ పర్సన్ ఉన్నారు. మోర్ దాన్ ఏ ఫ్రెండ్. ఇంకా ఒక ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారు. వచ్చే ముందు చెప్పి వచ్చాను. ఇలాంటివి ఏమీ చేయద్దు అని. కానీ, వినకుండా ఈ యాపారం పెట్టారు” అంటూ ఆరోహీ రావు చెప్పుకొచ్చింది. సెలబ్రేషన్స్ ఫ్రెండ్ చేసినా.. అసలు ఆ స్పెషల్ పర్సన్ ఎవరు అనేది దానిపై క్లారిటీ లేదు. ఎంత స్పెషల్ అనేది సీజన్ అయ్యేలోపు ఏమైనా రివీల్ చేస్తుందేమో చూడాలి. మరి.. ఆరోహీకి కామెంట్స్ రూపంలో జన్మదిన శుభాకాంక్షలు చెప్పేయండి.