Shrihan- Arohi: బిగ్ బాస్ హౌస్ లో శ్రీహన్-ఆరోహి మధ్య హగ్గులు! పాపం సిరి!

బిగ్‌ బాస్‌ తెలుగు సీజన్‌ 6.. అట్టహాసంగా ప్రారంభమై.. ఉత్కంఠగా కొనసాగుతోంది. మొదటి వారంలో చాలానే అప్‌డేట్లు జరిగాయి. వాటిలో ఎంతో ముఖ్యమైనవి బాలాదిత్య ఫస్ట్‌ కెప్టెన్‌ కావడం. రెండోది గీతూ రాయల్‌ వరస్ట్ పర్ఫార్మర్‌ అనే బిరుదుతో జైల్లో కూర్చోవడం. అవి కాకుండా ఇంకా ఇంట్లో చాలానే గొడవలు జరిగాయి. వంట చేసే దగ్గర, బాత్‌ రూమ్‌ కడిగే దగ్గర, టాస్కుల్లో ఇలా విషయం ఏదైనా ఇద్దరి మధ్య మాటల యుద్ధం జరగడం.. విషయం తెలియకుండానే మధ్యలో పడి జనాలు ఆపడం సర్వ సాధారణం. అంతేకాకుండా బిగ్‌ బాస్‌ హౌస్‌లో ఫీలింగ్స్‌ వస్తున్నాయి, వాళ్ల లవ్ ట్రాక్‌ ఉంది అనేది కూడా చాలా రెగ్యూలర్‌ టాపిక్‌ అనమాట. ఈ సీజన్లో ఇంకా ఏమీ స్టార్ట్‌ కాలేదే అని చాలా మంది ప్రేక్షకులు ఫీలవుతున్న వాళ్లు కూడా ఉన్నారు.

అయితే హౌస్‌లో ఎవరికి లవ్‌ ట్రాక్‌ పెట్టినా కనెక్ట్‌ అవుతారో లేదో తెలియదు గానీ, శ్రీహాన్‌కి మాత్రం ట్రాక్‌ పడితే షో సూపర్‌ సక్సెస్‌ అవుతుంది. అందుకేనోమో శ్రీహాన్‌ లేడీ కంటెస్టెంట్లకు చాలా దూరం వెళ్తున్నాడు. ఇనయా అయితే శ్రీహాన్‌తో మాట్లాడితే వాళ్లను నామినేట్‌ చేస్తాడు. నీకు సిరి ఉంది.. నువ్వు సేఫ్‌ గేమ్ ఆడుతున్నావ్‌. కీర్తీ మాట్లాడితే నామినేట్‌ చేశావ్. నేను మాట్లాడితే వరస్ట్‌ అని స్టాంప్‌ వేశావ్‌ అంటూ ఇనయా చేసిన కొన్ని వ్యాఖ్యలు ఇంట్లోని సభ్యులనే కాదు.. ప్రేక్షకులను సైంత ఆలోజింపచేస్తున్నాయి. నిజంగానే శ్రీహాన్‌ డిఫెన్స్ లో పడిపోయాడా? ఎవరికైనా దగ్గరవడానికి భయపడుతున్నాడా? అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఇలాంటి తరుణంలో ఆరోహీ రావు- శ్రీహాన్‌కు బాగా దగ్గరవడం చూస్తున్నాం.

ఆమె వీక్‌ స్టార్టింగ్‌లో శ్రీహాన్‌ గురించి చెబుతూ వాళ్ల మధ్య ఏదో ఉంది అన్నట్లుగా బిహేవ్‌ చేయడం చూశాం. కెమెరా చూస్తూ సిరి అలా కాదు అంటూ ఏదో చెప్పబోయి ఆగడం కూడా చూశాం. తాజాగా ఇనయా అన్న మాటలకు శ్రీహాన్‌ ఎంతో ఫీల్‌ అయ్యాడు. అలా ఫీలవ్వడమే కాకుండా శ్రీహాన్‌ ఏడ్చేశాడు. అది చూసి ఆర్జే సూర్య, రేవంత్‌ అతడిని ఓదార్చేందుకు ప్రయత్నిస్తారు. ఆ సమయంలో ఆరోహీ రావు కూడా శ్రీహాన్‌ను హగ్‌ చేసుకుని ఎమోషనల్‌ అవుతుంది. శ్రీహాన్‌ ఏడిస్తే తనకు కూడా కన్నీళ్లు వస్తున్నాయి అంటూ కామెంట్‌ చేసింది. ఇప్పుడు ప్రేక్షకులు అంతా అయ్యో సిరి పరిస్థితి ఏంటి అంటూ ప్రశ్నలు లేవనెత్తారు. శ్రీహాన్‌ కూడా ఎవరికైనా కనెక్ట్‌ అయితే ఏంటి పరిస్థితి అంటూ కామెంట్‌ చేస్తున్నారు.

ఆ తర్వాత కూడా ఆరోహీ రావు హగ్‌ విషయం గురించి మళ్లీ శ్రీహాన్‌తో చర్చిస్తుంది. ‘నేను అక్కడ చేసింది నాటకం అన్నావంట ఏంటి? నా కంట్లో నీళ్లు రాలేదు, నాదంతా యాక్టింగ్‌ అన్నావంటగా. హౌస్‌లో ఇప్పటి వరకు చాలా మంది ఏడ్చారు. కానీ, నేను ఒక్కసారి కూడా వాళ్లని చూసి ఏడవలేదు. కానీ, నువ్వు ఏడవగానే నాకు అనుకోకుండానే నీళ్లు వచ్చాయి. అందుకే నేను కూడా నిన్ను హగ్‌ చేసుకుని ఏడ్చేశాను. ఆరోహీ ప్రేమ అందరికీ దొరకదు.. దొరికినప్పుడే ఆణిముత్యంలా అందుకోవాలి” అంటూ శ్రీహాన్‌తో ఆరోహీ రావు చెప్పుకొచ్చింది. శ్రీహాన్‌కు ఇండికేషన్‌ ఇచ్చిందా? వార్నింగ్‌ ఇచ్చిందా? లేక అసలు ఆరోహీ ఏం చెప్పాలనుకుంటోంది అనేది మాత్రం ఎవరికీ అర్థం కాలేదు. ప్రేక్షకులు మాత్రం పాపం సిరి అంటూ రచ్చ మొదలు పెట్టారు. ఆరోహీ- శ్రీహాన్‌ హగ్గుల విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.


Show comments
SHARE THIS ARTICLE ON
Read Today's Latest bigg boss 6 teluguNewsTelugu News LIVE Updates on SumanTV