లేడీ ఫైర్ బ్రాండ్ ఇనయా సుల్తానా హౌస్ నుంచి ఎలిమినేట్ అయిన సంగతి తెలిసిందే. ఆమెను అన్యాయంగా హౌస్ నుంచి ఎలిమినేట్ చేశారంటూ ఆమె ఫ్యాన్స్ గొడవలు, నెట్టింట యుద్ధాలు కూడా చేశారు. అయితే టాప్-5లో ఉంటుందనుకున్న ఇనయా సుల్తానా 14వ వారం హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యింది. మొదటి రెండు వారాల్లోనే ఎలిమినేట్ అవుతుందనుకున్న ఈ అమ్మడు అనూహ్యంగా 14 వారాలు హౌస్ లో ఉండటం అందరినీ ఆశ్చర్యానకిి గురి చేసింది. నథింగ్ నుంచి స్ట్రాంగ్ ప్లేయర్ గా ఇనయా సుల్తానా అవతరించింది. లేడీ కంటెస్టెంట్లలో ఫిజికల్ టాస్కుల్లో ఇనయా సూపర్ అని నిరూపింకుంది. హస్ నుంచి రాగానే బయట కూడా సందడి మొదలు పెట్టేసింది.
హౌస్ లో ఉన్నప్పుడు ఇనయా సుల్తానా- సూర్య మధ్య ట్రాక్ నడిచిన విషయం తెలిసిందే. మొదట సూర్య- ఆరోహీ మధ్య లవ ట్రాక్ ఉందని చెప్పుకొచ్చారు. ఆ తర్వా ఆరోహి ఎలిమినేట్ అయిన తర్వాత సూర్య- ఇనయ కనెక్ట్ అయ్యారు. వాళ్లిద్దరూ చెట్టాపట్టాలేసుకుని తిరిగేశారు. గేమ్స్ కూడా కలిసే ఆడటం చూశాం. అయితే వాళ్లు ఎప్పుడూ వారి మధ్య ఉన్నది ప్రేమ అని చెప్పలేదు. కానీ, వారి బాడీ లాంగ్వేజ్ మాత్రం అలాగే ఉండేది. హౌస్ లో ఉన్న వాళ్లలో తన క్రష్ సూర్యా అని ఇనయా చెప్పిన సంగతి తెలిసిందే. తర్వాత వారి మధ్య దూరం పెరిగింది. సూర్య గురించి ఇనయ- రేవంత వద్ద బ్యాక్ బిచ్చింగ్ కూడా చేసింది. అలా అలకలు, హగ్గులు, గొడవలతో వారి రిలేషన్ సాగింది.
ఇప్పుడు హౌస్ నుంచి ఎలిమినేట్ అయిన తర్వాత ఇనయా సుల్తానా సూర్యాని కలిసింది. ఇనయాను హగ్ చేసుకున్న ఫొటో ఒకటి ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. ఆ ఫొటోని సూర్య తన ఇన్ స్టాగ్రామ్ పేజ్ లో పోస్ట్ చేశాడు. నా డార్లింగ్ ఫ్రెండ్, లేడీ టైగర్, ఇనయా సుల్తానాతో అంటూ క్యాప్షన్ కూడా పెట్టాడు. ఈ పోస్ట్ చూసిన నెటిజన్స్, బిగ్ బాస్ అభిమానులు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి కలిసిపోయారు అయితే మీరు అంటూ కామెంట్ చేస్తున్నారు. ఇంకొందరు అయితే ఇతకీ ఎవరిని పెళ్లి చేసుకుంటావ్ అంటూ సూటిగా ప్రశ్నిస్తున్నారు. సూర్యా ఫ్యాన్స్ మాత్రం అతనికి సపోర్ట్ గా నిలుస్తున్నారు. ఇనయాని మాత్రం అన్యాయంగా ఎలిమినేట్ చేశారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం వీళ్ల పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది.