బిగ్ బాస్ తెలుగు సీజన్ 6.. ఎంతో ఉత్కంఠగా సాగుతోంది. హౌస్‌లో సభ్యులు అంతా ఎవరు ఏ పార్టీ? ఎవరికి ఎవరు సపోర్ట్ అనే విషయంలో కాస్త క్లియర్‌గా ఉన్నట్లు కనిపిస్తున్నారు. విషయం ఏదైనా సరే ఒక గొడవ అవుతూనే ఉంటుంది. కొత్తగా బిగ్ బాస్ హౌస్‌కి కెప్టెన్ వచ్చిన విషయం తెలిసిందే. బాలాదిత్య కెప్టెన్‌గా వస్తూనే విధులు, విధానాలను నిర్దేశించాడు. గొడవలు పడకండి అంటూ స్ట్రాంగ్ వార్నింగ్ కూడా ఇచ్చాడు. అలా ఎవరైనా ఇంట్లో గొడవలు పెట్టేందుకు చూస్తే మాత్రం పనిష్మెంట్ తప్పదని చెప్పుకొచ్చాడు. ఈ సీజన్లో ఇప్పటివరకు బిగ్ బాస్ హౌస్‌లో బాగా వినిపించిన పేర్లు ఏవైనా ఉన్నాయి అంటే అవి ఒకటి రేవంత్, రెండు గీతూ రాయల్. ఈ పేర్లు మాత్రం తరచుగా ఇంట్లో వినిపిస్తూ ఉంటాయి.
అది కొన్నిసార్లు మంచి కావొచ్చేమో గానీ, చాలాసార్లు నెగెటివ్‌గానే వస్తుంటుంది. అలా రిపీటెడ్ గీతూ రాయల్ అన్నింటిలో వేలు పెట్టి వరస్ట్ పర్ఫార్మర్ అని పేరు తెచ్చుకుంది. ఆఖరికి ఆమెను పిరియడ్స్ అని కూడా చూడకుండా బిగ్ బాస్ జైల్లో పడేశారు. అయితే ఆమె ఇంట్లోని సభ్యుల నిర్ణయాన్ని అంగీకరించింది, జైల్లో కూర్చొంది. కానీ, అక్కడికి వెళ్లాక తన మనసులోని మాటలను బయటపెట్టింది. నిజానికి తనకంటే వరస్ట్ ఇంటి సభ్యులు ఉన్నారంటూ రేవంత్, ఇనయా సుల్తానా పేర్లను తీసింది. అందరికీ తాను ఈజీ టార్గెట్ కావడం వల్లే అలా చేశారంటూ వాపోయింది. అయితే తర్వాత జైల్లో ఉన్న గీతూ రాయల్‌తో రివ్యూవర్ ఆదిరెడ్డి కాసేపు మాట్లాడాడు. ఆ సమయంలో ఆదిరెడ్డి పలు ఆసక్తికర వ్యాఖ్యలుచేశాడు.
ముఖ్యంగా రేవంత్ గేమ్ ప్లే గురించి పలు వ్యాఖ్యలు చేయడం గమనార్హం. “రేవంత్ చాలా తెలివిగా గేమ్ ఆడుతున్నాడు. నేను పర్టిక్యులర్ మాట అన్నాను అనుకోండి. మనిషి అనేవాడు ఎవడూ వచ్చి వెంటనే మాట్లాడడు. ఒక క్యారెక్టర్‌ని ఎస్టాబ్లిష్ చేయాలని చూస్తున్నాడు. మనిషి మంచోడు అయ్యుండచ్చు. 100 శాతం మంచోడు కావచ్చు. వెంటనే వచ్చి మాట్లాడుతున్నాడు చూశావా.. అందులో ఒక 50 శాతం మంచితనం, 50 శాతం అతను జోవియల్, మంచివాడు అనిపించుకునేందుకు మాట్లాడుతూ ఉండచ్చు. గేమ్ పరంగానూ వెంటనే రియాక్ట్ అయ్యి మార్చుకోవడానికి ట్రై చేస్తున్నాడు. మిస్టేక్ ఉందని తెలిసినప్పుడు మాత్రం వెంటనే మార్చుకుంటున్నాడు” అంటూ ఆదిరెడ్డి రేవంత్ గేమ్ స్ట్రాటజీని లీక్ చేశాడు. ఆదిరెడ్డి వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.