ఈసారి బిగ్ బాస్ ఓ రేంజ్ లో ఉండబోతుంది. ఆల్రెడీ షో కూడా ప్రారంభమైపోయింది. పార్టిసిపెంట్స్ ఒక్కొక్కరు హౌస్ లోకి అడుగుపెడుతున్నారు. ఈసారి బిగ్ బాస్ హౌస్ లోకి ఆసక్తికర వ్యక్తి సభ్యుడిగా వచ్చాడు. అతనే యూట్యూబర్, బిగ్ బాస్ రివ్యూయర్ ఆదిరెడ్డి . బిగ్ బాస్ లో కామన్ మెన్ రాణించింది చాలా తక్కువే. కానీ ఆదిరెడ్డికి ఈ విషయంలో కొన్ని ప్లస్ పాయింట్స్ ఉన్నాయి. ఏమి తెలియనివాళ్లు హౌస్ లోకి అడుగుపెడితే కన్ఫ్యూజ్ అవుతారు. కానీ మనోడికి బిగ్ బాస్ గురించి చాలా బాగా తెలుసు.
ఇక వివరాల్లోకి వెళ్తే.. బిగ్ బాస్ ఆరో సీజన్ స్టార్టయిపోయింది. యూట్యూబర్ ఆదిరెడ్డి ఓ పార్టిసిపెంట్ గా వచ్చేశారు. సాధారణ రైతు కుటుంబానికి చెందిన ఈయనది నెల్లూరు జిల్లాలోని వరికుంటపాడు. సొంతూరిలోనే డిగ్రీ చదువుతూ మధ్యలోనే ఆపేశారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకంతో ఇంజనీరింగ్ పూర్తి చేశారు. ఆ తర్వాత అతడి తల్లి మరణించింది. దీంతో రెండేళ్ల పాటు ఇంట్లోనే ఉన్నారు. తర్వాత ఉద్యోగం కోసం బెంగుళూరు వెళ్లారు. అదే సమయంలో బిగ్ బాస్ 2ని వివరిస్తూ, కౌశల్ గురించి మాట్లాడుతూ ఓ వీడియో చేశారు. అది వైరల్ గా మారడంతో ఆదిరెడ్డి గుర్తింపు పొందారు.
అలా మూడో సీజన్ నుంచి ఈ షో గురించి వీడియోలు చేస్తూ ఫేమస్ అయ్యారు. దీంతోపాటు బిగ్ బాస్ ఆట, అక్కడి రూల్స్, అక్కడ వాళ్లు పెట్టే గేమ్స్ ఇలా అన్నింటిపై ఆదిరెడ్డికి మంచి అవగాహన ఉంది. ఫాలోయింగ్ పరంగా చూసుకున్నా.. ఆదిరెడ్డికి మంచి ఫ్యాన్ బేస్ ఉంది. అతని ఛానల్‌కు 3 లక్షలకు పైగా సబ్ స్క్రైబర్లు ఉన్నారు. 5 కోట్లకు పైగా వ్యూవర్ షిప్ ఉంది. వీటన్నింటిని దృష్టిలో పెట్టుకుంటే ఆదిరెడ్డి తప్పకుండా టాప్ 5 వరకు రాగలడని అప్పుడే అంచనాలు కూడా వేస్తున్నారు. మరి ఆదిరెడ్డి.. బిగ్ బాస్ లో ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తారో చూడాలి. ఈయన గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో పోస్ట్ చేయండి.
ఆదిరెడ్డి వ్యక్తిగత సమాచారం: