బిగ్ బాస్ అనగానేన టీవీ ప్రేక్షకులందరిలో ఓ జోష్ కనిపిస్తుంది. ఎందుకంటే.. బిగ్ బాస్ సీజన్ 5 నుండి ఇప్పుడు సీజన్ 6 వరకూ చాలా గ్యాప్ వచ్చింది. అయితే.. మొత్తానికి బిగ్ బాస్ రియాలిటీ షో 6వ సీజన్ తో అలరించేందుకు రెడీ అయిపోయింది. కింగ్ నాగార్జున హోస్ట్ చేస్తున్న ఈ షోలో ఈసారి ఎవరెవరు కంటెస్టెంట్స్ గా పాల్గొంటారనే ఆసక్తి అందరిలో నెలకొంది. గత సీజన్స్ కి భిన్నంగా ఎంటర్టైన్ మెంట్ కి అడ్డా ఫిక్స్ అంటున్న షోలోకి.. కొంతకాలంగా ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్న నటి, డ్యాన్సర్ అభినయ శ్రీ తొమ్మిదవ సభ్యురాలిగా హౌస్ లో అడుగుపెట్టింది.
ఆమె ఎవరో కాదు.. ఐటమ్ సాంగ్స్ ద్వారా తెలుగులో సూపర్ క్రేజ్ దక్కించుకున్న అభినయ శ్రీ. ఈ బ్యూటీ గురించి సినీ ప్రియులకు ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ఎందుకంటే.. ఆర్య సినిమాలోని ‘అ అంటే అమలాపురం’ సాంగ్ నుండి 2015లో పాండవులు మూవీలోని ఐటమ్ సాంగ్ వరకూ ఎంటర్టైన్ చేస్తూ వచ్చింది. అభినయ శ్రీ మదర్ అనురాధ కూడా అలనాటి ఐటమ్ డ్యాన్సర్ కావడం విశేషం. ఇక చెన్నైలో పుట్టి పెరిగిన అభినయ శ్రీ.. తమిళంలో కంటే తెలుగులో సినిమాలలో ఎక్కువగా మెరిసింది.
ఇదిలా ఉండగా.. 38 ఏళ్ల వయసున్న అభినయ ఇప్పటికి సింగిల్ గా ఉంటోంది. ఇప్పుడు బిగ్ బాస్ వేదికగా కంటెస్టెంట్ గా అలరించేందుకు రెడీ అయిపోయింది. ఇక ఎప్పటిలాగే తనదైన శైలిలో మాస్ డ్యాన్స్ పెర్ఫార్మన్స్ తో ఎంట్రీ ఇచ్చింది అభినయ శ్రీ. తెలుగులో ఎన్నో సినిమాలలో మెరిసిన అభినయ.. తమిళంలో పలు డ్యాన్స్ షోలకు జడ్జిగా కూడా వ్యవహరించింది. అయితే.. ఇప్పుడు బిగ్ బాస్ ద్వారా మరోసారి తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. మరి అభినయ శ్రీ బిగ్ బాస్ లో నెగ్గగలదా లేదా కామెంట్స్ లో తెలియజేయండి.