బిగ్ బాస్ తెలుగు సీజన్ 6.. దాదాపుగా చివరి మజిలీకి చేరుకుంది. ఈ సీజన్ ఆఖరి వారంలోకి అడుగుపెట్టింది. హౌస్లో చివరకు ఆరుగురు సభ్యులు మిగిలాారు. తాజాగా ఫైర్ బ్రాండ్ ఇనయా సుల్తానా హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చేసింది. ఆఖరి వరకు ఆదిరెడ్డి- ఇనయా సుల్తానా రాాగా.. ఆఖర్లో ఇనయా ఎలిమినేట్ కాగా.. ఆదిరెడ్డి సేవ్ అయ్యాడు. హౌస్ నుంచి మరో స్ట్రాంగ్ కంటెస్టెంట్ ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చేసింది. లేడీ ఇంటిసభ్యుల్లో ఇనయ స్ట్రాంగ్ అని అందరికీ తెలిసిందే. అయితే ఆమెనే ఎలిమినేట్ చేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆమెను కావాలనే ఎలిమినేట్ చేశారంటూ కామెంట్ చేస్తున్నారు. ఇవన్నీ పక్కన పెడితే అసలు ఇనయా సుల్తానా ఎందుకు ఎలిమినేట్ అయ్యింది.. అందుకు గల కారణాలు ఏంటో చూద్దాం.
ఇనయా సుల్తానా టాప్-5 కంటెస్టెంట్ అని అందరికీ తెలుసు. కానీ, ఆమెను ఎలిమినేట్ చేసి పంపేశారు. అయితే మొదటి కారణం.. అది బిగ్ బాస్ ఇష్టం. అవును బిగ్ బాస్ లో ఎవిరిని కావాలంటే వారిని ఎలిమినేట్ చేస్తారని అందరికీ తెలిసిందే. అందులో భాగంగానే ఇనయాని ఎలిమినేట్ చేసుండచ్చు. అందుకు కూడా ఆస్కారం లేకపోలేదు. తర్వాత ఇనయా గేమ్ లో జోష్ తగ్గింది. అవును.. ఫ్యామిలీ వీక్ తర్వాత ఇనయా సుల్తానా గేమ్ స్లో అయ్యింది. హౌస్ లో అందరితో మంచిగా ఉండటం స్టార్ట్ చేేసింది. గేమ్ మీద ఫోకస్ తగ్గింది అనే భావన కలిగింది.
రామ్ గోపాల్ వర్మ.. ఇనయా సుల్తానా హౌస్ లో ఉండటానికి, ఆమెకు ఇంత గుర్తింపు రావడానికి రామ్ గోపాల్ వర్మనే కారణం అని అందరికీ తెలిసిందే. ఆర్జీవీ వేసిన ఒక్క ట్వీట్ తో ఎలిమినేట్ కావాల్సిన ఇనయా సుల్తానా 14వ వారం వరకూ వచ్చింది. ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ సినిమాపై ఫోకస్ పెట్టి ఆమెకు సపోర్ట్ చేయకపోవడంతో ఆమె ఇలా ఎలిమినేట్ అయి బయటకు వచ్చేసింది అంటున్నారు. శ్రీసత్య.. అవును ఆమె కారణంగానే ఇనయా ఎలిమినేట్ అయ్యిందని చెబుతున్నారు. ఆమెను సేవ్ చేసేందుుకే ఇనయా సుల్తానాను ఎలిమినేట్ చేశారు అనేది మరోవాదన. అందులో కూడా నిజం లేకపోలేదు. ఎందుకంటే.. శ్రీసత్య ఎప్పుడో హౌౌస్ నుంచి ఎలిమినేట్ కావాల్సింది. కానీ, ఏదో కారణం చేత ఇంకా నెట్టుకొస్తోంది. మొత్తానికి ఇనయా సుల్తానాని ఎలిమినేట్ చేసి పంపేశారు. అయితే ఆమెది అన్ ఫెయిల్ ఎలిమినేషన్ అంటూ నెట్టింట యుద్ధాలు చేస్తున్నారు.
Yesterday night Anapurna studio 💥💥💥 Winner ni intiki pamparu kadara 💔 kodakalara 😡😡😡 #inayaunfairelimination Love u Inaya ❤️Forever pic.twitter.com/8xu2YutPuM
— N.Mallikarjuna (@Malli_1111) December 11, 2022