‘బిగ్ బాస్ 5 తెలుగు’కు ఉన్న క్రేజ్ చెప్పనక్కర్లేదు. బిగ్ బాస్ 5లో విజేత ఏవరో తెలిసే సమయం దగ్గర పడింది. దీంతో అందరిలో ఆసక్తి నెలకొంది. బిగ్ బాస్ లో లవ్ ట్రాక్స్ ఎంత సహజమో.. గ్రూప్ తగాదాలు అంతే కామన్. అది ఏ సీజన్ లో అయినా జరిగేదని కొందరి అభిప్రాయం. అయితే ప్రస్తుతం హౌస్ లో సన్నీ, షణ్ముఖ్ మధ్యలో రాజుకున్న గొడవ.. హౌస్ దాటి.. బయట వారిద్దరి అభిమానుల గొడవగా మారింది. బిగ్ బాస్ విన్నర్ షణ్ముఖ్ అంటూ ఒక గ్రూప్ … కాదు సన్నీనే విజేత అని మరో గ్రూప్ సోషల్ మీడియాలో బూతులు తిట్టుకుంటున్నారు. ఈ క్రమంలో సన్నీ తల్లి కళావతి స్పందించింది. దయచేసి వ్యక్తిగత దూషణలు వద్దని షణ్ముఖ్ ఫ్యాన్స్ కి చేతులెత్తి దండం పెట్టి వేడుకుంది.
గొడవకు కారణం..
వీరిద్దరి అభిమానుల గొడవకి ముఖ్య కారణం.. రోజు రోజుకి సన్నీకి మద్దతు పెరిగిపోతుండటమే అని అంటున్నారు నెటిజన్స్. వీకెండ్ ఎపిసోడ్లో మిగతా కంటెస్టెంట్ల ఫ్యామిలీ మెంబర్స్ అందరూ సన్నీ టాప్-5లో కచ్చితంగా ఉంటాడని చెప్పడం జరిగింది. షణ్నూ- సన్నీ ఫ్యాన్స్ మధ్య సామాజిక మాధ్యమాల వేదికగా వార్ నడుస్తొంది. విజేత అయ్యేది సన్నీనే అంటూ అతని ఫ్యాన్స్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నారు. అదే స్థాయిలో షణ్నూ అభిమానులు కూడా సోషల్ మీడియాలో హంగామా చేస్తున్నారు. ఈ క్రమంలో ఒకరిని ఒకరు బూతులు తిట్టుకుంటూ సోషల్ మీడియాలో ట్రోల్స్ చేస్తూ నెగిటివిటీని పెంచేస్తున్నారు.
సన్నీకి ఇటీవల కాలంలో ఫ్యాన్ బేస్.. ఫాలోయింగ్ పెరిగిన మాట వాస్తవం. షణ్ముఖ్ పై అంచనాలు ఉన్నప్పటికీ టాస్క్ లలో అతడు అంత ఆసక్తిగా ఉండడు అనే విమర్శ ఉంది. టాస్క్ మినహాయించి ఇతర విషయాలలో కరెక్ట్ పాయింట్ మాట్లాడడం షణ్నూ బలం. బిగ్ బాస్ ఫైనలిస్టుల విషయంలో మొదట్లో యాంకర్ రవి, మానస్, శ్రీరామ్ వంటి చాలామందిపై అంచనాలు ఉన్నా.. తాజాగా మాత్రం వేరే పేర్లు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా సన్నీ, షణ్ముఖ్, శ్రీరామ్, కాజల్.. మానస్ లు టాప్ 5 లో ఉంటారనేది కొందరి అభిప్రాయంగా వినిపిస్తోంది.
ఇక ఇదిలా ఉండగా సన్నీ, షణ్ముఖ్ అభిమానులు పరస్పర విమర్శలతో సోషల్ మీడియాని వేడెక్కిస్తున్నారు. దీనితో సన్నీ తల్లి కళావతి సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. “మీకు నచ్చిన వారికి ఓట్లు వేసి గెలిపించండి.. అంతేకాని నెగిటివ్ కామెంట్స్ చేయవద్దు. ఒకరిని హీరో చేయడం కోసం మరొకరిని జీరో చేయవద్దు” అని సన్నీ తల్లి కళావతి నెటిజన్లని చేతులు జోడించి వేడుకున్నారు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
A request to all of you from kalavathi amma 😍#biggbosstelugu5 pic.twitter.com/Jw2bwrdJax
— Sunny Vj (@vjsunnyofficial) November 28, 2021