‘బిగ్ బాస్ 5 తెలుగు’ సీజన్ గ్రాండ్ గా ముగిసింది. వీజే సన్నీ విన్నర్ గా, షణ్ముఖ్ రన్నర్ గా నిలిచారు. శ్రీరామ్ మూడోస్థానంలో, మానస్-4, సిరి ఐదోస్థానంతో సరిపెట్టుకున్నారు. ఈ సీజన్ ద్వారా బిగ్ బాస్ ప్రేక్షకులు ఏం నేర్చుకున్నారు అనే ప్రశ్న ఒకటి వినిపిస్తోంది. అందుకు కొందరు చాలా స్ట్రైట్ గా ఆన్సర్ చెప్తున్నారు. అదే ఫ్రెండ్ షిప్ గురించి. అందులోనూ వారు సన్నీ-మానస్, సిరి- షణ్ముఖ్ రిలేషన్ ను ఉదాహరణగా చూపిస్తున్నారు. స్వచ్ఛమైన స్నేహం, స్నేహంతో మొదలై ఆకర్షణగా మారిన తీరును ప్రస్తావిస్తున్నారు. అసలు అలా కంక్లూజన్ కు వస్తున్నారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
అంతంత మాత్రం ఫ్యాన్ బేస్ తో సన్నీ- మానస్ ఇద్దరూ బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టారు. కానీ, సీజన్ ఎండింగ్ లో మాత్రం సన్నీ విన్నర్ గా, అతని బెస్ట్ ఫ్రెండ్ మానస్ గా బయటకు వచ్చారు. ఈ ఇద్దరి జర్నీ చూసి ఎంతో మంది ఆనందిస్తున్నవారున్నారు. ఫ్రెండ్ షిప్ అంటే అది అంటూ కామెంట్ చేస్తున్నారు. నిజానికి సన్నీ- మానస్ ఇద్దరూ బిగ్ బాస్ కు వచ్చిన తర్వాతే ఫ్రెండ్స్ అయ్యారు. ఈ 105 రోజుల ప్రయాణం వారి మధ్య నూరేళ్ల స్నేహానికి బాటలు వేసింది. వాళ్లిద్దరూ ఒకరి కోసం ఒకరు నిలబడే తీరు. సన్నీ తప్పులను కరెక్ట్ చేస్తూ ఉండే మానస్ ను చూసి చాలా మంది మురిసిపోయారు.
టాస్కులు, ఇంట్లో గొడవలు సందర్భం ఏదైనా సన్నీ- మానస్ మాత్రం ఎప్పుడూ ఒకేలా ఉన్నారు. జెన్యూన్ గా ఉన్నది ఎవరు అనే ప్రశ్న వచ్చిన సందర్భంలోనూ సన్నీ- మానస్ పేర్లే వినిపించాయి. సన్నీ టైటిల్ విన్నర్ అయినా పర్లేదు. వాడు గెలవాలి అంటూ మానస్ అన్న మాటలు ప్రేక్షకుల హదయాలను హత్తుకున్నాయి. సన్నీ తర్వాత అతని విజయాన్ని అదే స్థాయిలో ఆస్వాదించింది మానస్. లైఫ్ టైమ్ ఫ్రెండ్ దొరికేశాడు అంటూ సన్నీ- మానస్ లు అనుకున్న మాటలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.
సిరి- షణ్ముఖ్ లకు బయటున్న పరిచయం ఇంట్లోకి వెళ్లాక స్నేహంగా మారింది. కొద్ది రోజులు గడిచేసరికి ఆ స్నేహం ఇష్టం అయ్యింది. చివరి వారాల్లోకి అడుగుపెట్టే సరికి ఆ ఇష్టం కాస్తా ఆకర్షణగా.. ఆ తర్వాతి స్టేజ్ కి రూపాంతరం చెందుతూ వచ్చింది. వీరిని అత్యంత నెగెటివ్ గా మార్చిన విషయం హగ్గు. అవును వీరి ఫ్రెండ్ షిప్ హగ్గు వీరి ఓటమికి ప్రధాన కారణం. వీరిద్దరికీ బయట ఇంకో ఇద్దరు లేకుంటే క్యూట్ పెయిర్ ఆఫ్ బిగ్ బాస్ గా టైటిల్ కొట్టేసేవారు. కానీ, బయట కమిట్ అయ్యి బిగ్ బాస్ అలా చేసే సిరికి ఇద్దరికీ అది బ్యాక్ ఫైర్ అయ్యింది. సిరి తల్లి వచ్చి హగ్గులొద్దమ్మా అని వారించిన తర్వాత అది మరింత నెగెటివ్ గా మారింది.
ఎంత మంది ఎన్ని చెప్పినా వారి ప్రవర్తనలో మార్పు రాకపోవడం ప్రేక్షకులను అసహనానికి గురి చేసింది. మానస్ గెలవాలని సన్నీ.. సన్నీ గెలవాలని మానస్ లు కోరుకున్నారు. కానీ, అలాంటి బాండింగ్ సిరి- షణ్ముఖ్ ల మధ్య కనిపించలేదు. షణ్ముఖ్ ను ఎప్పుడూ విన్నర్ గా చూడాలని సిరి కోరుకుంది కానీ, షణ్ముఖ్ మాత్రం తానే విన్నర్ కావాలనుకున్నాడు. మధ్య మధ్యలో వీళ్లిద్దరూ చెప్పిన డైలాగులు, నాగార్జున ముందు ఓపెన్ అయిన తీరు ఇంకా బ్యాడ్ గా చేసింది. వెరసి అత్యంత ప్రేక్షకాదరణతో బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టిన సిరి- షణ్ముఖ్ ఒకళ్లు టాప్-5, ఇంకొంకరు రన్నరప్ తో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. సన్నీ- మానస్, సిరి- షణ్ముఖ్ ఫ్రెండ్ షిప్ పై మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి.