ఈ సారి బిగ్ బాస్ సీజన్ 5 టైటిల్‌ను ఎవరు ముద్దాడబోతున్నారు అన్న దానిపై ఎన్నో సోషల్ మీడియాలో రకాల చర్చలు జరుగుతున్నాయి. బిగ్ బాస్ ఐదో సీజన్‌లో ఫినాలేకు చేరుకున్న మానస్, శ్రీరామ చంద్ర, సిరి హన్మంత్, షణ్ముఖ్ జస్వంత్, వీజే సన్నీలు ఎవరికి వారే తమ సత్తాను నిరూపించుకుని ఇక్కడి వరకూ వచ్చారు. బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో అలరించిన బిగ్ బాస్ సీజన్ 5 చివరి అంకానికి చేరుకుంది. రేపటితో ఈ రియాల్టీ షో ముగియనుంది. ఈ సీజన్ విన్నర్ ఎవరుకావచ్చనే దానిపై పెద్ద చర్చ జరుగుతోంది.
బిగ్ బాస్ సీజన్‌లో ఫినాలేకు ఐదుగురు చేరుకున్నా చివరికి మాత్రం వీజే సన్నీ, శ్రీరామచంద్ర ఫైనల్ కి చేరుకున్నట్లు టాక్ వినిపిస్తుంది. వీరిద్దరూ ప్రేక్షకులను అలరించడానికి తమ వంతుగా బెటర్ పర్ఫామెన్స్ ఇచ్చారు. తన పర్ఫామెన్స్, కామెడీ, సీరియస్, ఎమోషన్ తో సన్నీ ప్రజల హృదయాలు గెల్చుకుంటే.. శ్రీరామ చంద్ర తన అందమైన గానంతో, మెచ్యూర్ గా గేమ్ ఆడుతూ.. ఎవరి మనసు నొప్పించకుండా కూల్ గా ఆడుతూ అందరి మనసు దోచాడు. అయితే ఇప్పుడు ఆఖరి గట్టంలో గ్రాండ్ ఫినాలేలో సన్నీ, శ్రీరామచంద్ర పోటీలో ఉండబోతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఓటింగ్ పరంగా చూస్తూ సన్నీ ముందంజలో ఉండగా తర్వాత మంచి స్థానంలో శ్రీరామ చంద్ర ఉన్నాడు.
ఇదీ చదవండి : మీకు దమ్ముంటే ఆ పని చేయండి. యాంకర్ రవి భార్య నిత్య సవాల్!
బిగ్ బాస్ స్టేజ్ పై ఏదైనా జరగొచ్చు అన్న విషయం తెలిసిందే. బిగ్ బాస్ సీజన్ 5 విజేత గా శ్రీరామ చంద్ర గెలిచే అవకాశాలు ఉన్నాయని అభిమానులు అంటున్నారు. కొన్ని వర్గాల నుంచి శ్రీరామ చంద్ర విజేతగా నిలవబోతున్నాడని టాక్ గట్టిగానే వినిపిస్తుంది. మరి అనూహ్య పరిణామాల మద్య సన్నీకి శ్రీరామ చంద్ర భారీ ట్విస్ట్ ఇవ్వబోతున్నాడా? ఏది ఏమైనా ఇది ఎంత వరకు వాస్తవం అన్నది తెలియాలంటే.. రేపటి ఎపిసోడ్ లో చూడాల్సిందే. ఈ విషయం ఈ విషయం పై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.