“బిగ్ బాస్-5” తుది దశకు చేరింది. బిగ్ బాస్ 5 తెలుగు మరికా సేపట్లో ముగియనుండటంతో విజేత ఎవరో తెలిపోనుంది. దీనికి సంబంధించి శనివారమే గ్రాండ్ ఫినాలే షూట్ జరిగినట్లు సమాచారం. విశ్వసనీయ సమాచారం ప్రకారం సిరి, షణ్ముఖ్ అభిమానులకు షాకింగ్ న్యూస్. మొదటి నుంచి విన్నర్ రేస్ లో ఉన్న షన్ను కనీసం రన్నరప్ కాకుండ బయటకు వచ్చినట్లు సమాచారం. ఇప్పడున్న సమాచారం ప్రకారం.. హౌస్ నుంచి ముందుగా సిరి బయటకు వెళ్లినట్లు తెలిసింది.
ఆమె తర్వాతే షన్ను కూడా బయటకు వెళ్లినట్లు సమాచారం. అయితే.. వీరు బిగ్ బాస్ ఇచ్చే మనీ ఆఫర్ను స్వీకరించారో లేదా అనేది మాత్రం తెలియరాలేదు. మొదటి మూడు స్థానాల్లో సన్నీ, శ్రీరామ్, మానస్ ఉన్నట్లు తెలుస్తోంది. సిరి, షన్ను ఎలిమినేట్ అవడం వారి అభిమానులకు బిగ్ బాస్ ఊహించని షాకిచ్చినట్లుగా తెలిసింది. టాప్-2లో ఉంటాడని భావించిన షన్ను.. సిరి తరువాత హౌస్ నుంచి బయటకు వచ్చినట్లు.. తెలిసింది. దీంతో శ్రీరామ్ లైన్ క్లియర్ అయిపోయింది.
గతంలో ఇండియన్ ఐడల్లో విజేతగా నిలిచిన శ్రీరామచంద్ర.. బిగ్ బాస్ టైటిల్ కొట్టేస్తాడనే ఉత్కంఠ నెలకొంది. అయితే, ఫైనల్.. బిగ్ బాస్లో మంచి ఫన్ అందించి మార్కులు కొట్టేసిన సన్నీయే విజేతగా నిలిచినట్లు సమాచారం. అయితే, ఖచ్చితంగా ఏం జరిగిందనేది ఆదివారం ప్రసారమయ్యే.. గ్రాండ్ ఫినాలేలో తేలుతుంది. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. ఎవరెవరు ఏ స్థానంలో ఉన్నారంటే.. సన్నీ, శ్రీరామ చంద్ర, మానస్, షన్ను, సిరి హన్మంత్.
హౌస్ లో ఉన్న సభ్యులు ఎవరికి వారే స్ట్రాంగ్. చెప్పాలంటే.. మానస్, సన్నీలకు మొదట్లో పెద్దగా అభిమానులు లేరు. దీంతో వారు ఎన్నివారాలు ఉంటారనేది కూడా డౌట్గా ఉండేది. యూట్యూబ్ వీడియోలతో ఫేమస్గా మారిన సిరి, షన్నులకు యూత్ ఫాలోయింగ్ ఉండటంతో స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ గా ఇంట్లోకి అడుగుపెట్టారు. ఇక శ్రీరామ చంద్ర ఇండియన్ ఐడల్లో పాల్గొనడం వల్ల జాతీయస్థాయిలో అభిమానులు ఉన్నారు. . వీరంతా బిగ్ బాస్ హౌస్లోకి వచ్చిన తర్వాతే ఎక్కువ మంది అభిమానులను పొందారు. అయితే, షన్ను, సిరిలు మొదటి నుంచి కలిసే ఆడటం.. అభిమానులకు కూడా నచ్చట్లేదని తెలుస్తోంది. ఇదే వారి ఎలిమినేషన్ కు ప్రధాన కారణంమని తెలుస్తోంది. ఏది ఏమైనా.. విన్నర్ ఎవరనేది రేపే అధికారికంగా తెలుస్తుంది. ఇక బిగ్ బాస్ 5 తెలుగు ఎవరనేది దానిపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.