‘బిగ్ బాస్ 5 తెలుగు’లో ఆదివారం హౌస్‌లో దీపావళి వేడుకలు కన్నులపండువగా సాగాయి. చివర్లో మాత్రం లోబో ఎలిమినేషన్ అందరినీ కన్నీళ్లు పెట్టించింది. మొత్తం హౌస్ నుంచి ఇప్పటివరకు 8 మంది ఎలిమినేట్ అయ్యారు. వెళ్లే ముందు అందరూ వారివారి అభిప్రాయాలను చెప్పేసి వెళ్తారు. అలాగే లోబో కూడా తన అభిప్రాయాలను పంచుకున్నాడు. అందరూ నెగెటివ్‌గా చూసే ఆర్జే కాజల్ ఎంతో మంచిది అని లోబో కితాబు ఇచ్చాడు. షణ్ముఖ్‌కి వచ్చే భార్య అయినా.. సిరి చేసినట్లు సేవలు చేయలేదు అంటూ షాకింగ్ కామెంట్ కూడా చేశాడు. ఆ వివరాలు పక్కన పెడితే.. సోమవారం అంటే తెలుసు కదా. బిగ్ బాస్‌లో సోమవారం అంటే నామినేషన్స్.. ప్రేక్షకులకు ఎంటర్‌టైన్మెంట్. ఈ సీజన్‌లో మాత్రం నామినేషన్స్ సమయంలో జరిగే రచ్చ ఇప్పటివరకు ఎప్పుడూ జరగలేదు.
ఇదీ చదవండి: కోహ్లీ సేన సెమీస్ చేరాలంటే.. అద్భుతాలు జరగాలి!
రోజులు గడుస్తున్న కొద్దీ.. ఇంట్లో సభ్యుల మధ్య దూరం పెరుగుతోంది. గ్రూపులుగా ఆడుతున్నారు. సందర్భం దొరికిన ప్రతిసారి ఎదుటివారిని గ్రూపులుగా ఆడుతున్నారంటూ కామెంట్ చేస్తున్నారు. ఇందుకు ఎవరూ అతీతులు కాదు అందరూ అదే చేస్తున్నారు. ఈ వారం నామినేషన్స్‌లోనూ అదే తరహా ప్రవర్తన కనిపించింది. మీరు గ్రూపులు మీరు గ్రూపులు అనుకుంటూనే నామినేషన్స్ చేసుకన్నారు. ఇంట్లో ప్రస్తుత కెప్టెన్ షణ్ముఖ్ జశ్వంత్ తప్ప అందరూ నామినేషన్స్‌లో ఉన్నారు. షాకయ్యారా? అవును మొత్తం 10 మంది ఈ వారం నామినేషన్స్‌లో ఉన్నారు. కెప్టెన్ కావడం వల్లే షణ్ముఖ్ నామినేట్ కాలేదు. అవకాశం ఉంటే షణ్ముఖ్ కూడా నామినేషన్స్‌లో ఉండే వాడు. ‘మా సీజన్‌లో ఎవరు కోపంగా ఉన్నారో లెక్కపెట్టి చెప్పచ్చు. మీ బ్యాచ్ మాత్రం ఎవరిని కదిలించినా తొడలు కొడుతున్నారు’ అంటూ సోహెల్ చేసిన కామెంట్ ఫన్నీగానే అయినా అందులో ఎంతో నిజం ఉంది. ఈ సీజన్‌లో సరదాగా కలిసి మాట్లాడుకునే వాళ్లకంటే కలబడేందుకు ప్రయత్నిస్తున్నవాళ్లే ఎక్కువ ఉన్నారు. ఈ వారం హౌస్ నుంచి ఎవరు ఎలిమినేట్ అవుతారని మీరు అనుకుంటున్నారు? మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి.