‘బిగ్ బాస్ 5 తెలుగు’ ఆట వేడెక్కింది. హౌస్‌లో బృందాలుగా విడిపోయి కొట్లాటకు దిగారు. పేరుకు టాస్క్ కోసమే అయినా అందులో వారివారి మనోగతాలు కూడా బయటపడుతున్నాయి. ‘పంతం నీదా నాదా అన్న టాస్క్‌ను పైచేయి నీదా? నాదా? అన్న స్థాయికి చేర్చారు. నేరుగా కొట్టుకోవడం ఒక్కటే ఈ టాస్కులో మిగిలి ఉంది. రానున్న ఎపిసోడ్‌లో అదికూడా చూడొచ్చేమో? ప్రతి సీజన్‌తో పోల్చుకుంటే ఈ సీజన్‌లో ఆంగ్లంలో బూతులే కాదు.. అచ్చ తెలుగు బూతులు కూడా వాడేస్తున్నారు. టాస్క్ గెలవాలన్న ఒకే తాపత్రయంతో కొట్లాటకు దిగేస్తున్నారు.
ఇప్పిటవరకు చాలా కూల్‌గా ఎంతో మెచ్యూరిటీతో గేమ్ ఆడిన ప్రియ కూడా నోరు జారేసింది. టాస్క్‌లో సన్నీని మగాడివైతే వచ్చి ఆడాలంటూ సవాలు విసిరింది. అందుకు వీజే సన్నీ చాలా సీరియస్‌గా సమాధాన మిచ్చాడు. మగాడు అదీ ఇదీ మాట్లాడొద్దు అంటూ హెచ్చరించాడు. మరోవైపు శ్వేత, సిరి హన్మంతు బాహాబాహీకి దిగారు. గ్రడ్జ్ ఉంటే రా అనిసవాలు చేసిన సిరిని శ్వేత నేరుగా వెళ్లి గుద్దేస్తుంది. తనకు తల్లిగా భావిస్తున్న యానీ మాస్టర్ కూడా శ్వేతను తప్పుబట్టింది. ప్రియ అయితే సాయంత్రం కాగానే దెయ్యంపడుతుందంటూ సెటైర్ వేసింది.
సింగర్ శ్రీరామచంద్ర ఈ టాస్క్‌తో ఫైర్ బ్రాండ్ అవతారం ఎత్తేశాడు. కాజల్ కలగజేసుకోవడాన్ని సహించలేక కేకలేశాడు. తాజాగా యాంకర్ రవి, టీమ్ ఉల్ఫ్ కెప్టెన్ మానస్‌తోనూ లడాయికి దిగాడు. రవిని ఫిజికల్ గేమ్స్ ఆడు కానీ, నాతో మైండ్ గేమ్స్ ఆడొద్దంటూ గట్టిగా వార్నింగ్ ఇచ్చాడు. మరోవైపు మానస్‌ను నువ్వు చిన్నపిల్లాడివంటూ కామెంట్ చేశాడు. ఈ టాస్క్ ప్రారంభం నుంచి శ్రీరామ్ చాలా అగ్రెసివ్‌గా ఆడుతున్నాడు. ఫిజికల్ గానూ విశ్వాతో కలిసి దూకేస్తున్నాడు. బాహాబాహీకి కూడా సవాళ్లు విసురుతున్నాడు. ఒక్క టాస్కుతో అందరి లోపల ఉన్న ఫీలింగ్స్, కోపం అన్నీ బయటకు వస్తున్నట్లు తెలుస్తోంది. లోబో అయితే పక్కకు కూర్చోని ఏడుస్తున్నాడు.
‘బిగ్ బాస్ 5 తెలుగు’కు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్, గాసిప్స్, ఎలిమినేషన్స్ వంటి ఆసక్తికర కథనాల కోసం సుమన్ టీవీ వెబ్‌సైట్‌ని చూస్తుండండి.